తిన్నామా? పడుకున్నామా? తెల్లారిందా? ఇది ఒకప్పటి మాట.. తెల్లారిందా? వెబ్ సిరీసో, సినిమానో చూసేశామా? పడుకున్నామా? అనేది యూత్ ఇప్పటిమాట.. అసలే కరోనా నిబంధనల వల్ల థియేటర్లు వెలవెలబోతున్నాయి, కొత్త సినిమాల ఊసే లేకుండా పోయింది. ఎప్పుడో షూటింగ్స్ పూర్తి చేసుకున్న అడపాదడపా చిత్రాలు మాత్రం కొన్ని ఓటీటీలో రిలీజవుతున్నాయి.
అయితే సినిమాలే కాకుండా వెబ్‌సిరీస్, ప్రత్యేక షోల ద్వారా ప్రేక్షకుడికి కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు పోటీపడుతున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్. ఈ క్రమంలో ప్రాంతీయ చిత్రాలతో పాటు, పాన్ ఇండియా లెవల్ వెబ్‌సిరీస్‌లు అందిస్తోంది అమెజాన్ ప్రైమ్ వీడియో. మరి ఈ శుక్రవారం(జూన్ 4) ప్రైమ్‌లో ఏమేం సినిమాలు, సిరీస్‌లు అలరించేందుకు రెడీ అయ్యాయో చూసేయండి..
ద ఫ్యామిలీ మ్యాన్ 2
మనోజ్ భాజ్‌పాయి, సమంత, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ "ద ఫ్యామిలీ మ్యాన్ 2". రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ సిరీస్ జూన్ 4 నుంచి ప్రైమ్‌లో ప్రసారం కానుంది.
డామ్ సీజన్ 2
కొకైన్‌కు బానిసైన ఓ వ్యక్తి క్రిమినల్ గ్యాంగ్‌కు లీడర్‌గా ఎలా ఎదిగాడు? తర్వాత ఏం జరిగింది? అనేదాని చుట్టూ డామ్ సిరీస్ నడుస్తుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాను చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. వివరంగా చెప్పాలంటే డామ్ రెండో సీజన్ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డాక్యుమెంటల్ సీజన్ 4
కొందరు కమెడియన్లు వారి నవ్వును ఎంతమేరకు కంట్రోల్ చేసుకోగలుగుతారని టెస్ట్ చేసే ఈ సీజన్ కూడా జూన్ 4 నుంచే ప్రసారం కానుంది.
'హెడ్ ఎబోవ్ వాటర్' అనే ఫిక్షనల్ డాక్యుమెంటరీ, 'ద మార్టేనియన్', 'ద విచెస్' చిత్రాలు కూడా జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ వీకెండ్ బోర్ కొట్టకుండా ఉండాలంటే పై వాటిలో మీకు నచ్చింది సెలక్ట్ చేసుకుని ఎంచక్కా పాప్‌కార్న్ తింటూ చూసేయండి..
Comments
Please login to add a commentAdd a comment