మహారాజా?  | SS Rajamouli And Mahesh Babu Upcoming Movie Title Maharaja, Rumours Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

SS Rajamouli - Mahesh Babu: మహారాజా? 

Published Sat, Feb 17 2024 1:15 AM | Last Updated on Sat, Feb 17 2024 8:40 AM

Maharaja the new name for the upcoming SS Rajamouli and Mahesh Babu movie - Sakshi

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని హీరోయిన్‌ పాత్ర కోసం ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఇస్లాన్, దీపికా పదుకోన్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘మహారాజా’, ‘మహారాజ్‌’, ‘చక్రవర్తి’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది.

మరి.. ఫైనల్‌గా ఈ టైటిల్స్‌లో ఏదో ఒకటి ఫిక్స్‌ అవుతుందా? లేక మరొక టైటిల్‌ను మేకర్స్‌ ఖరారు చేస్తారా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు. ఇక విజయేంద్రప్రసాద్‌ కథ అందించిన ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతదర్శకుడు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ ఏడాది వేసవిలో ఆరంభమవుతుందని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement