
అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం అన్నాడు జాతిపిత మహాత్మాగాంధీ. కానీ అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు కూడా అమ్మాయిలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఆడవారిపై మానసికంగా, శారీరకంగా జరుగుతున్న దాడుల గురించి నిత్యం ఏదో ఒక వార్త వెలుగుచూస్తూనే ఉంది. తాజాగా వారిని కాపాడాల్సిన ఓ పోలీసే అమ్మాయిని వేధింపులకు గురి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రాత్రిపూట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని అడ్డగించాడో పోలీస్. ఆమెపై అభ్యంతరకరంగా చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ బాలిక ఎలాగోలా అతడి చెర నుంచి తప్పించుకుని అక్కడి నుంచి బయటపడింది. దీన్నంతటినీ కొందరు వ్యక్తులు ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నటి మంచు లక్ష్మిఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ దారుణాన్ని చూస్తుంటే రక్తం మరిగిపోతుందంటూ ట్వీట్ చేసింది. ఆడవారిని కాపాడాల్సిన పోలీసే ఇంతటి దారుణానికి ఒడిగడితే ఇంకెవరిని సాయం చేయమని అడుగుతాం? అని ఆవేదన చెందుతున్నారు మహిళలు. ఇక ఈ వీడియో తీసినవాళ్లు పోలీస్ నుంచి ఆ అమ్మాయిని కాపాడితే బాగుండేదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
https://twitter.com/LakshmiManchu/status/1633664602918785024
Comments
Please login to add a commentAdd a comment