![Manchu Vishnu Chadarangam wins India Best Web Series Award - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/15/vishnu.jpg.webp?itok=JI1bwd2A)
శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రాజ్ ఆనంత దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘చదరంగం’ (2020). 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ పతాకంపై హీరో మంచు విష్ణు నిర్మించిన తొలి వెబ్ సిరీస్ ఇది. ఆన్ డిమాండ్ వీడియో, ఆడియో కంటెంట్‌లకు సంబంధించి ఎక్స్‌ఛేంజ్ ఫర్ మీడియా గ్రూప్ ప్రకటించిన స్ట్రీమింగ్ మీడియా అవార్డ్స్‌లో ‘చదరంగం’ ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా అవార్డు గెలుచుకుంది.
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ – ‘‘ఈ అవార్డు రావడం చాలా గౌరవంగా ఉంది. ‘చదరంగం’ మా టీమ్ అందరి మనసులకు దగ్గరైన వెబ్ సిరీస్. భవిష్యత్‌లో ఇంకా ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌ను చేసేందుకు ఇలాంటి అవార్డ్స్ ఉత్సాహాన్ని ఇస్తాయి’’ అన్నారు. ‘చదరంగం’ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ తొమ్మిది ఎపిసోడ్స్‌గా రూపొందింది.
Comments
Please login to add a commentAdd a comment