ఫోర్‌ కొట్టారు | Jeffrey Gee Chin joins hands with Vishnu Manchu | Sakshi
Sakshi News home page

ఫోర్‌ కొట్టారు

Published Tue, Jul 9 2019 12:32 AM | Last Updated on Tue, Jul 9 2019 12:32 AM

Jeffrey Gee Chin joins hands with Vishnu Manchu - Sakshi

మంచు విష్ణు ఫోర్‌ కొట్టారు. క్రికెట్‌ ఆడటం మొదలెట్టారా? అంటే కాదు. ఒకే రోజు నాలుగు ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌  చేసి ఫోర్‌ కొట్టారు. నటుడిగా, నిర్మాతగా ఈ నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో ఒకటి హాలీవుడ్‌ చిత్రం, ఒకటి వెబ్‌ సిరీస్‌ కావడం విశేషం. జెఫ్రీ చిన్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో విష్ణుతో పాటు మరికొంత మంది హాలీవుడ్‌ నటీనటులు నటించనున్నారు. అలాగే పలువురు హాలీవుడ్‌  టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేయనున్నారు.

మరో సినిమాలో విష్ణు, కాజల్‌ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు.  ఐటీ ఇండస్ట్రీలో జరిగిన 2,800 కోట్ల స్కామ్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. ఇంకో సినిమాని నిర్మించనున్నారు. ‘మీ రా రోడ్‌’  అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాతో సుబ్బరాజు అనే దర్శకుడు పరిచయం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విడిపోక ముందు జరిగే పొలిటికల్‌ థ్రిల్లర్‌ జానర్‌లో వెబ్‌ సిరీస్‌ని నిర్మించనున్నారు. శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ వెబ్‌ సిరీస్‌కు పరుచూరి గోపాల కృష్ణ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. ‘‘రెండేళ్లుగా ఈ పనిలో నిమగ్నమై ఉన్నాను. మీ అందరి శుభాకాంక్షలు కావాలి’’ అన్నారు విష్ణు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement