
శాండల్‌వుడ్ బ్యూటీలు ఇప్పుడు దక్షిణాదిని దున్నేస్తున్నారనే చెప్పవచ్చు. ఉదాహరణకు రష్మిక మందన్ననే చూస్తే నాలుగేళ్లలోనే దక్షిణాదిని దాటి బాలీవుడ్‌కు ఎగబాకారు. ఇప్పుడు మరో కన్నడ భామ మేఘా శెట్టి కోలీవుడ్‌పై కన్నేశారు. ఈమె విషయానికి వస్తే.. బుల్లితెర నుంచి వెండితెరకు ఎదిగారు. అందంతో పాటు ప్రతిభ సొంతమైన మేఘా శెట్టి కన్నడ చిత్రాల్లో సత్తా చాటుతున్నారు. నటనంటే తనకు చెప్పలేనంత ఇష్టం అని అందుకే ఈ రంగంలోకి వచ్చానని పేర్కొన్నారు.
నటనకు అవకాశమున్న పాత్రల్లో నటించడానికి తానెప్పుడూ సిద్ధమే అన్న ఈ కన్నడ భామ ఛాలెంజింగ్ పాత్రల్లో నటించడం మరీ ఇష్టం అంటున్నారు. ఇకపోతే తమిళ చిత్రాలంటే తనకు చాలా మక్కువ అని పేర్కొన్నారు. తమిళ చిత్రాలను ఎక్కువగా చూస్తానని చెప్పారు. ఇక్కడ కథానాయికలకు మంచి పాత్రల్లో నటించే అవకాశాలు వస్తుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
త్వరలోనే కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. తాను ఇక్కడ నటించడంతో పాటు ప్రేక్షకులకు మంచి కథా చిత్రాలను అందించడానికి చిత్ర నిర్మాణం చేపడతానని చెప్పారు. ఇది తన తండ్రి వ్యాపారమే కాకుండా తన ఆసక్తి అని నటి మేఘా శెట్టి పేర్కొన్నారు. మరి కోలీవుడ్ ఈ బ్యూటీని ఏ మాత్రం ఆదరిస్తుందో చూడాలి.
చదవండి: అమానుషం.. నటుడి భార్య కిడ్నాప్.. రెండు నెలలుగా గదిలో బంధించి!
‘ఊరు పేరు భైరవకోన ’ టాక్ ఎలా ఉందంటే.. ?
Comments
Please login to add a commentAdd a comment