
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఉపశీర్షిక. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విజయ్ ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీని పూరి కనెక్ట్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇందులో లెజెండరి మాజీ ఆటగాడు, బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక లైగర్‌లో టైసన్ నటిస్తుండటంతో ఈ మూవీకి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా గురువారం(నవంబర్ 4) మైక్ టైసన్‌కు చెందిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పిడికిలి బిగించి సింహనాదం చేస్తున్న టైసన్ ఫొటో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను థాయిలాండ్ కు చెందిన స్టంట్ డైరెక్టర్ కెచ్చా కంపోజ్ చేస్తున్నారు. లైగర్‌లో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.
Happy Diwali Indiaaa 🤗
— Vijay Deverakonda (@TheDeverakonda) November 4, 2021
Pakka #AagLagaDenge 🔥#LIGER
2022. pic.twitter.com/ZQxuIvPd1z