సంక్రాంతి పందాలకు ఇప్పటి నుంచే రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్', వెంకటేశ్ 'నారప్ప', నితిన్ 'రంగ్‌దే' చిత్రాలు పొంగల్‌కు రెడీ అవుతుండగా తాజాగా యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్" కూడా పోటీకి దిగింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా సినిమా నుంచి రొమాంటిక్ పోస్టర్‌ను కూడా వదిలింది. ఈ పోస్టర్‌లో టైటిల్‌కు తగ్గట్టుగానే అఖిల్ పక్కా బ్యాచిలర్ అని నిరూపించుకున్నాడు. పక్కన వైభ పాత్రలో ఉన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే అందాన్ని కన్నెత్తి కూడా చూడకుండా ముందున్న ల్యాప్‌ట్యాప్‌లోనే మొహం పెట్టి తన పనిలో నిమగ్నమయ్యాడు. (బ్యాచ్‌లర్ తొలి సాంగ్ వచ్చేసింది)
దీంతో హీరోను ఏడిపించేందుకు పూజా కాలితో అఖిల్ చెవిని మెలిపెడుతున్నా అతగాడికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఓ పాట పర్వాలేదనిపించింది. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించారు. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు. తొలుత ఈ సినిమాను వేసవికి, ఆ తర్వాత దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దామనుకున్నారు. కానీ పరిస్థితులు ఇప్పుడప్పుడే సర్దుకునేలా లేకపోవడంతో వచ్చే ఏడాదికే రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. (నిర్మాత సత్యనారాయణ ఇకలేరు)
Comments
Please login to add a commentAdd a comment