
Mouni Roy Stunning Looks In Short Skirt At Beach: హాటెస్ట్ టీవీ నటీమణుల్లో మౌని రాయ్ ఒకరు. 2015-16 మధ్య వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ టీవీ సీరియల్ 'నాగిన్ 1 (తెలుగులో నాగిని)'తో ప్రేక్షకులకు పరిచయమైంది మౌని. అందులో శివన్య (తెలుగులో శివాని)గా ఆకారాన్ని మార్చే పాము పాత్రలో నటించి అలరించింది. ఈ పాత్రకు అత్యధిక పారితోషికం పొందే హిందీ టెలివిజన్ నటీమణుల్లో ఒకరిగా స్థిరపడింది. తర్వాత ఈ సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన 'నాగిన్ 2'లో (2016-17) తల్లిన శివన్య, కూతురు శివంగిగా రెండు పాత్రలు పోషించింది.
అయితే ఈ సీరియల్ ముద్దుగుమ్మ తన అద్భుతమైన ఫొటోలతో అభిమానులను ఎప్పుడూ అబ్బురపరుస్తుంది. భారతీయ సాంప్రదాయ దుస్తుల నుంచి స్టైలిష్, పొట్టి దుస్తుల వరకు మౌని ధరించే ప‍్రతి ఔట్‌ఫిట్‌లో మనోహరంగా కనిపిస్తుంది. తాజాగా తన్ ఇన్‌స్టా గ్రామ్‌లో బీచ్‌లో షికారు చేస్తున్న ఒక అందమైన వీడియోను షేర్ చేసింది మౌని. అందులో తెల్లటి పొట్టి గౌను ధరించి బీచ్‌లో వయ్యారంగా నడుస్తుంది. ఆ ఇసుకతిన్నెల్లో ఎర్రగా ప్రకాశిస్తున్న సూర్యుడికి ఎదురుగా తెల్లటి గౌనులో అతి సుందరంగా మౌని నడక చూడముచ్చటగా ఉంది.
ఇదిలా ఉంటే మౌని రాయ్ తన ప్రియుడు, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను జనవరి 2022లో వివాహం చేసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ జంట దుబాయ్ లేదా ఇటలీలో వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. హిందీ సీరియల్ తర్వాత స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన గోల్డ్ చిత్రంతో బాలీవుడ్ సినీ పరిశ‍్రమలోకి రంగప్రవేశం చేసింది మౌని రాయ్. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకోవడమై కాకుండా కమర్షియల్‌గా కూడా విజయం సాధించింది. అలాగే మౌని 'బెస్ట్ ఫీమేల్ డెబ్యూ ఫిలీంఫేర్' అవార్డుకు నామినేట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment