
భాషను ఎలాగోలా మేనేజ్ చేయొచ్చనుకున్నాను. కానీ భాష అర్థం కానప్పుడు ప్రతీది కష్టంగా అనిపిస్తుంది. ఇదే నా చివరి చిత్రం... దీని తర్వాత ఇక్కడ సినిమాలు చేయనన్నాను.
మృణాల్ ఠాకూర్.. ఈ పేరు చెప్పగానే చాలామందికి యువరాణి నూర్‌జహానే గుర్తుకువస్తుంది. సీతారామం సినిమాతో అంతటి గుర్తింపు, గౌరవం సంపాదించింది. తెలుగులో తొలి సినిమాతోనే తనను అంతగా ప్రేమిస్తున్న సినీప్రియులకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో అర్థం కాలేదు. అందుకే ఫ్యామిలీ స్టార్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సాష్టాంగ నమస్కారం చేసి తన కృతజ్ఞతను బయటపెట్టింది.
నా కన్నీళ్లు వృథా కాలేదు
అయితే తనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన సీతారామం సినిమా షూటింగ్ సమయంలో మృణాల్ తెగ ఏడ్చేసిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది. మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. 'భాష తెలియనప్పుడు ఈ సినిమా ఎలా చేయగలుగుతానా? అనిపించింది. కొన్నిసార్లయితే నా వల్ల కాక వదిలేద్దామనుకున్నాను, ఏడ్చేశాను. కానీ ఆ కన్నీళ్లు వృథాగా పోలేదు. సీతారామం వల్ల నేను ఎన్నో ప్రశంసలు అందుకున్నాను. అయినా మొదటగా సినిమా కథ ముఖ్యం, భాషను ఎలాగోలా మేనేజ్ చేయొచ్చనుకున్నాను. కానీ భాష అర్థం కానప్పుడు ప్రతీది కష్టంగా అనిపిస్తుంది.
తెలుగులో నా చివరి చిత్రం!
అయితే చిన్నప్పటి నుంచి నన్ను నేను ఒక యువరాణిలా చూడాలనుకున్నాను. అందుకు ఇంతకన్నా మంచి అవకాశం దొరకదనిపించింది. ఈ మూవీ కశ్మీర్ షూటింగ్‌లో ఉన్నప్పుడు సీతారామం.. తెలుగులో నా ఫస్ట్ సినిమా మాత్రమే కాదు, చివరి సినిమా కూడా! అని దుల్కర్ సల్మాన్‌కు చెప్పాను. దీని తర్వాత ఇక్కడ సినిమాలు చేయనన్నాను. అతడు అలాగే చూస్తూ సరే, చూద్దాం అన్నాడు. ఇప్పుడు అన్ని భాషల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నానంటే అందుకు అతడు కూడా ఓ కారణమే' అని చెప్పుకొచ్చింది.
చదవండి: ఓపక్క విలన్ వెయిటింగ్.. ఆ సీన్ చేయనని ఏడ్చేసిన హీరోయిన్..