ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’.రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్రచందనం స్మంగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన పుష్పరాజ్ పాత్రకు సంబంధించిన వీడియో అభిమానుల తెగ ఆకట్టుకుంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారట నిర్మాతలు. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.40 కోట్ల ఖర్చు చేస్తున్నారట. అల్లు అర్జున్‌కు మంచి మార్కెట్ ఉండడం, పాన్ ఇండియా స్థాయి సినిమా కావడంతో ఖర్చు విషయంలో నిర్మాతలు అస్సలు రాజీపడటం లేదట. ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
బడ్జెట్‌లో ఎక్కువ భాగం యాక్షన్ సీక్వెన్స్‌కే కేటాయించారని టాక్. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ యాక్షన్స్ సీక్వెన్స్ ఉంటాయట. ఈ చిత్రంలో విలన్ గా మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నటిస్తున్నాడు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment