
దేశంలో కరోనా మహహ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సామన్యులు మొదలు సెలబ్రిటీల వరకు వ్యాక్సిన్ కోసం బారులు తీరుతున్నారు. ఇప్పటికే రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు వంటి స్టార్స్ సెకండ్ డోస్ వాక్సిన్ తీసుకోగా, తాజాగా కోలీవుడ్ ప్రేమ జంట నయనతార, విఘ్నేష్ శివన్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా పేరు సంపాదించకున్న బ్యూటీ నయనతార, యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన కలిసి వెళ్లడం, ఏ కార్యక్రమంలోనైనా కలిసే పాల్గొంటున్నారు. త్వరలో వీరిద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇంతలో కరోనా సెకండ్ వేవ్ వచ్చేయటంతో బ్రేక్ పడింది. ప్రస్తుతం నయన తార సమంతతో కలిసి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుత వాయిదా పడింది. విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment