కరోనా : నయనతార-విగ్నేష్‌ శివన్‌ల వీడియో | Vignesh Shivan Posted Video With Nayanthara Viral in Social Media | Sakshi
Sakshi News home page

లాలీపాప్‌ కావాలా కన్నా..!

Published Tue, Jun 23 2020 6:18 AM | Last Updated on Tue, Jun 23 2020 7:48 AM

Vignesh Shivan Posted Video With Nayanthara Viral in Social Media - Sakshi

ట్విట్టర్‌ లో వైరల్‌ అవుతున్న నయనతార, విగ్నేష్‌ శివన్‌ ఫొటో

సినిమా: దక్షిణాది సిని పరిశ్ర మలో అగ్ర నటిగా రాణిస్తున్న నయన తార తరచూ వార్తల్లో ఉంటోంది. ఈ మె ఇంతకుముందు నటుడు శింబు, ఆతర్వాత ప్రభు దేవాలతో  ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. అయితే వారితో ప్రేమ బెడిసి కొట్టడంతో కొంతకాలం ఒంటరిగా ఉన్న నయనతార ఆ తరువాత మళ్లీ దర్శకుడు విగ్నేష్‌ శివన్‌తో  ప్రేమాయణం మొదలెట్టింది. నానుమ్‌ రౌడీ దాన్‌ చిత్రంతో మొదలైన వీరి ప్రేమ ఇప్పుడు కలిసి సహజీవనం చేసే వరకు వచ్చింది. కాగా వీరిద్దరూ ఇప్పటికే రహస్యంగా వివాహం చేసుకున్నారని, కాదు త్వరలోనే పెళ్లికి సిద్ధం అవుతున్నారని, ఇలా రకరకాలుగా ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఏదేమైనప్పటికీ నయనతార దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ కలసి సహజీవనం చేస్తున్నారన్నది నిజం. అలా వీరిద్దరూ తరచుగా కలిసి తీసుకున్న రొమాంటిక్‌ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. కాగా ప్రస్తుతం కరానా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే.

ఇలాంటి పరిస్థితుల్లో నయనతార దర్శకుడు విగ్నేష్‌ శివన్‌లకు కరోనా పాజిటివ్‌ వచ్చిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే దీన్ని దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ ఖండించారు. అందులో భాగంగా ఆయన ఒక వీడియోను తన ట్విట్టర్లో విడుదల చేశారు. అందులో తనను నయనతారను చిన్నపిల్లలగా మార్చి ఒక రైమ్స్‌ డాన్స్‌ చేసే విధంగా దృశ్యం రూపొందించారు. ఆ వీడియోలో ఫోటోలు చూస్తుంటే చిన్ననాటి నయ నతార విగ్నేష్‌ శివంలు  ఇలానే ఉంటారు  అనిపిస్తోంది. కాగా ఆ వీడియోలో దర్శకుడు విగ్నేశ్‌ శివన్‌  పేర్కొంటూ తమ గురించి వదంతులను ప్రచారం చేసే వారికి తాము చెప్పే బదులు ఇదేనని అన్నారు . కరానా పాజిటివ్‌  కారణంగా తాము క్వారంటైన్‌లో ఉన్నట్లు  ప్రసారం చేసేవారికి తాము జీవించి ఉన్నామని , ఆరోగ్యంగానూ, సంతోషంగా ఉన్నామని చెప్పడానికి ఈ వీడియోను రూపొందించినట్లు పేర్కొన్నారు. మీలాంటి జోకర్ల కల్పితాలనూ  చెత్త జోకులనూ చూడడానికి ఆ దేవుడు తమకు తగిన బలాన్ని సంతోషాన్ని ఇచ్చారని దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు లాలీపాప్‌ కావాలా కన్నా అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement