నయనతార... అందంతో పాటు చక్కటి అభినయంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి. ఒక పక్క స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. మరో పక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూ.. లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. కథలలో కొత్త దనం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది.
ఇటీవల సూపర్ స్టార్ రజినికాంత్ కథానాయకుడిగా వచ్చిన ‘దర్బార్’ చిత్రంలో ఆయనకు జోడిగా నటించింది. ఆతర్వాత మూక్తి అమ్మన్ అనే తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నయన్. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అన్నతే, కతువాకుల రెండు కాదల్ అనే చిత్రాలు ఉన్నాయి.
కాగా, తెలుగు, తమిళ్ భాషల్లోనే కాదు మలయాళంలోనూ రాణిస్తుంది ఈ హాట్ బ్యూటీ. అక్కడ నిజల్ అనే సినిమాలోనూ నయన్ నటించింది. ఈ సినిమాలో చాకో బోబన్ – నయనతార హీరో హీరోయిన్లుగా నటించగా సైజు కురుప్, దివ్య ప్రభా, రోనీ డేవిడ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా రిలీజ్ కాబోతుంది. మే 9న ఈ సినిమా 4K & Dolby ఓటీటీ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు అప్పు ఎన్ భట్టతిరి దర్శకత్వం వహించారు.
Kunchacko Boban - Nayanthara starrer #Nizhal, streaming in 4K & Dolby Atmos from May 9.#KunchackoBoban #Nayanthara @appubhattathiri #SoorajSKurup @AJFilmCompany #MelangeFilmHouse #TentpoleMovies#IdhuVeraLevelEntertainment #SayNoToPiracy #Malayalam #NizhalOnSimplySouth pic.twitter.com/PninjU3kBe
— Simply South (@SimplySouthApp) May 4, 2021
Comments
Please login to add a commentAdd a comment