
పండగలు కలిసి జరుపుకుంటున్నారు.. పుట్టినరోజులు చేసుకుంటున్నారు.. విహార యాత్రలు వెళుతున్నారు.. ఇప్పుడు ఇద్దరూ కలసి సినిమాలు నిర్మిస్తున్నారు. జాయింట్‌గా ఇన్ని చేస్తున్నారు కదా.. మరి ఇద్దరూ ఒకింటివారయ్యేదెప్పుడు? అనే ప్రశ్నకు మాత్రం నయనతార–విఘ్నేష్ శివన్ నుంచి సమాధానం రావడంలేదు. కానీ మార్చిలో నయన మెడలో విఘ్నేష్ మూడు ముడులు వేయనున్నారన్నది కోలీవుడ్ తాజా టాక్. ఈ ఇద్దరూ ఇటీవల ఓ జ్యోతిష్కుణ్ణి సంప్రదించారట. మార్చిలో ముహూర్తం ఫిక్స్ అయిందని భోగట్టా. ఇప్పటికి నయన–విఘ్నేష్ గురించి ఇలాంటి వార్త చాలాసార్లు వచ్చింది. మరి... ఇప్పుడు వార్తల్లో ఉన్నట్లు మార్చిలో ఈ జంట ఏడడుగులు వేస్తుందా? చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment