విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్ ’. ఈ చిత్రం ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ టైటిల్‌తో తెలుగులో విడుదల కానుంది. రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్‌పై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ సినిమాని ఈ నెల 19న తెలుగులో విడుదల చేస్తున్నారు. వెంకటస్వామి మాట్లాడుతూ– ‘‘మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటన హైలైట్. విలక్షణ నటనతో ప్రేక్షకులని అలరిస్తారాయన. ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో నిహారిక కనిపిస్తారు. తమిళ ప్రేక్షకులకు నచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment