
అస్కార్ అవార్డ్ గ్రహిత దర్శకుడు హమ్దాన్ బల్లాల్‌పై ఇజ్రాయెల్ స్థిరనివాసులు దాడి చేశారు. 'నో అదర్ ల్యాండ్' డాక్యుమెంటరీ చిత్రానికి ఆయన కో-డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ చిత్రం విడుదల సమయంలో ఇజ్రాయెల్‌తో పాటు చాలా విదేశాల్లో ఉన్న ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. పాలస్తీనాకు చెందిన బల్లాల్ ఈ సినిమాలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చూపారు. దీనిని వారు జీర్ణించుకోలేకపోయారు. ఆయనపై దాడి చేస్తామని గతంలోనే వారు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కొన్నేళ్లుగా హింస జరుగుతున్న నేపథ్యంలో 'నో అదర్ ల్యాండ్' అనే డాక్యుమెంటరీతో దర్శకుడు హమ్దాన్ బల్లాల్ సంచలనం రేపాడు. దీంతో ఆగ్రహం చెందిన ఇజ్రాయెల్‌లోని వలసదారులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. కారులో వెళ్తున్న బల్లాల్‌ను అడ్డగించిన ఇజ్రాయెల్ స్థిరనివాసులు సుమారు 20 మంది ముసుగులు ధరించి రాళ్ళు, కర్రలతో దాడి చేశారు. ఆపై ఇజ్రాయెల్ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుందని సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు చెప్పినట్లు ఆయన మిత్రుడు యువల్ అబ్రహం తెలిపారు. తీవ్రంగా గాయపడిన బల్లాల్ తల నుంచి అధిక రక్తస్రావం అవుతుందని ఆయన పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు అతని ఆచూకి ఎక్కడ ఉందో తెలియదని ఆయన చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment