లెజెండరీ సింగర్‌ పాటను ఖూనీ చేశారు: పాకిస్తాన్‌ నటుడు | Pakistani actor Adnan Siddiqui Slams Kriti Sanon Akhiyan De Kol Song | Sakshi
Sakshi News home page

మా పాట కాపీ కొట్టి చెడగొట్టారు.. పాక్‌ నటుడు విమర్శలు

Published Wed, Oct 23 2024 7:55 PM | Last Updated on Wed, Oct 23 2024 8:07 PM

Pakistani actor Adnan Siddiqui Slams Kriti Sanon Akhiyan De Kol Song

పాత పాటల్ని రీమిక్స్‌ చేయడం చాలాకాలంగా చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని హిట్‌ సాంగ్స్‌ను టచ్‌ చేయకపోవడమే బెటర్‌ అంటున్నాడు పాకిస్తాన్‌ నటుడు అద్నానీ సిద్దిఖి. ఇటీవలే 'దో పత్తి' సినిమాలో నుంచి కృతి సనన్‌ 'అఖియాన్‌ డి కోల్‌..' పాటను రిలీజ్‌ చేశారు. నిజానికి ఈ సాంగ్‌ ఒరిజినల్‌ వర్షన్‌ పాకిస్తాన్‌ ఫేమస్‌ సింగర్‌ రేష్మ పాడింది. ఆ క్లాసిక్‌ సాంగ్‌ను బాలీవుడ్‌ మూవీ కోసం మార్చేసి వాడుకున్నారు.

ఆమె పాటను ఖూనీ..
ఇది పాక్‌ నటుడు అద్నానీకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డాడు. పాటను కాపీ కొడితే అది ఇంకా బాగుండాలే తప్ప చెడగొట్టకూడదు. లెజెండ్‌ రేష్మగారిపై కాస్తైనా గౌరవం చూపించండి. తన పాటల్ని ఖూనీ చేయకండి ఎక్స్‌ (ట్విటర్‌)లో మండిపడ్డాడు. ఈ ట్వీట్‌కు కృతి సనన్‌ డ్యాన్స్‌ స్టిల్‌ను జత చేశాడు.

బాలీవుడ్‌ సాంగే బెటర్‌
కొందరు ఆయన అభిప్రాయాన్ని గౌరవించగా మరికొందరేమో తప్పుపడుతున్నారు. 'అలాంటప్పుడు మీ పాటల్ని మీ దగ్గరే ఉంచుకోండి. ఇండియన్‌ లేబుల్స్‌కు అమ్మకండి. అప్పుడే మీ పాటలు భారతీయ సినిమాల్లో కనిపించవు', 'ఒరిజినల్‌ కన్నా బాలీవుడ్‌ సాంగే బెటర్‌గా ఉంది' అంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సినిమా..
దో పత్తి సినిమా విషయానికి వస్తే.. కాజోల్‌, కృతి సనన్‌, షాహీర్‌ షైఖ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ అక్టోబర్‌ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇటీవల రిలీజ్‌ చేసిన అఖియాన్‌ డి కోల్‌ పాటను శిల్పారావు ఆలపించింది. తనిష్క్‌ బగ్చి సంగీతం అందించగా కౌసర్‌ మునీర్‌ లిరిక్స్‌ సమకూర్చాడు.

 

 

 చదవండి:

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement