
Pawan Kalyan Birthday Celebrations: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు( సెప్టెంబర్ 2 )ను పురస్కరించుకుని కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఘనంగా బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరిరామ జోగయ్య మాట్లాడుతూ.. 'కాపు సంక్షేమ సేన ఏర్పడి ఏడాది దాటింది. ఈ సంస్థ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. ఏ రాజకీయ పార్టీకి, కులానికి వ్యతిరేకమూ కాదు. కేవలం కాపు కులస్తుల సంక్షేమం కోరుతూ ముందుకు నడుస్తున్న సోషల్ ఆర్గనైజేషన్ మాత్రమే. రాజకీయంగా ఎదుగుతున్న కాపు నాయకులను ప్రోత్సహించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం' అని పేర్కొన్నారు.
అనంతరం 'మెమె' అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. కాపు సంక్షేమ సేన సమర్పణలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మళ్ళినీడి తిరుమలరావు నిర్మించిన ఈ చిత్రానికి సినీ రచయిత రాజేంద్ర కుమార్ దర్శకత్వం వహించారు.
ఈ వేడుకలో మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి చేగొండి హరిరామ జోగయ్యతో పాటు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, నిర్మాత అడ్డాల చంటి, రత్నం, రాఘవేంద్ర రెడ్డి, గంగయ్య నాయుడు, విఠల్, ఎంవి రావ్, చందు జనార్దన్, నిర్మాత వానపల్లి బాబురావు, వడ్డీ సుబ్బారావు, దర్శకుడు రాజేంద్ర కుమార్, రణ్వీర్ సాయి చంద్, ప్రభాకర్, శ్రీనివాస్, చేరగడ్డ శ్రీనాథ్, కేవీ రమణమూర్తి, పద్మజ లక్ష్మి, శ్యామ్, సత్యనారాయణ, సురేష్ కొండేటి, ముత్యాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment