Adipurush Prabhas Look: Prabhas New Look Photos | ప్రభాస్‌​ కొత్త లుక్‌ చూశారా? - Sakshi
Sakshi News home page

ప్రభాస్‌​ కొత్త లుక్‌ చూశారా?

Published Sun, Feb 21 2021 3:46 PM | Last Updated on Wed, Mar 3 2021 8:09 PM

Prabhas Adipurush Look Goes Viral - Sakshi

మిర్చిలాంటి కుర్రాడు, బాహుబలి వంటి బలవంతుడు ప్రభాస్‌. ఆయన ప్రస్తుతం ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో ఏకకాలంలో నటిస్తున్నాడు. రాధాకృష్ణ "రాధేశ్యామ్‌" ఫైనల్‌ షూటింగ్‌ జరుపుకుంటుండగా, కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ "సలార్‌" రెగ్యులర్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక ఈ మధ్యే ఓం రౌత్‌ "ఆదిపురుష్‌" షూటింగ్‌ కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్‌ రాముడి అవతారం ఎత్తనున్నాడు. ఇదిలా వుంటే ఈ సినిమా సెట్స్‌లో ప్రభాస్‌ను కలిసిన ఓ అభిమాని హీరోతో ఫొటో దిగాడు. వెంటనే దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ఇంకేముందీ ఈ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తూ వైరల్‌గా మారింది. రాముడిగా కనిపించేందుకు ప్రభాస్‌ ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నాడని, ఆ విషయం ఫొటో చూస్తే ఇట్టే తెలిసిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలో కళ్లజోడు, తలకు క్యాప్‌ పెట్టుకుని ఉన్న ప్రభాస్‌ కొత్త లుక్‌ ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారగా ట్విటర్‌లో #Adipurush హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్‌' నుంచి ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఎప్పుడెప్పుడు రిలీజ్‌ చేస్తారా? అని డార్లింగ్‌ ఫ్యాన్స్‌ తెగ ఎదురు చూస్తున్నారు.

'ఆదిపురుష్'‌ సినిమా విషయానికి వస్తే.. ఇందులో ప్రభాస్‌ శ్రీరాముడిగా, సైఫ్‌ అలీ ఖాన్‌ లంకేశ్‌(రావణుడు)గా కనిపించనున్నారు. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి సనన్‌ను సీతగా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని పక్కన పెడితే ప్రభాస్‌ మరో చిత్రం 'రాధేశ్యామ్'‌ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో  జూలై 30న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. వచ్చే ఏడాది ఆగస్టు 11న 'ఆదిపురుష్‌' విడుదల కానుంది.

చదవండి: ‘సినిమా చూస్తూ కాలంలో వెనక్కి వెళ్దాం’’

ప్రభాస్‌ ‘ఆదిపురుష్’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement