
'ఈశ్వర్' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభిమానులను, ప్రేక్షకులను తనదైన నటనతో మెప్పిస్తున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ హల్‌చల్ సృష్టిస్తున్నాడు. ప్రభాస్ క్రేజ్‌ను నిర్మాతలు సైతం క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే డార్లింగ్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకోసం పెద్ద మొత్తంలోనూ ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు.
అలా ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రాల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్' ఒకటి. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీని వీలైనంత త్వరలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' సినిమా బడ్జెట్, రిలీజ్‌పై పలు ఆసక్తిర విశేషాలు సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతున్నాయి.
ఆదిపురుష్ మూవీ మొత్తం బడ్జెట్ రూ. 400 కోట్లు అని తెలుస్తోంది. సుమారు 15 భారతీయ, అంతర్జాతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20,000 థియేటర్లలో ఒకేసారి ఆదిపురుష్ రిలీజ్ కానుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా పిలవడంలో అనుమానం లేదని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment