Prabhas Adipurush Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Prabhas: ఆదిపురుష్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన మేకర్స్‌

Published Tue, Mar 1 2022 10:35 AM | Last Updated on Tue, Mar 1 2022 11:05 AM

Prabhas Adipurush Movie Release Date Announced On 2023 January 12 - Sakshi

‘డార్లింగ్‌’ ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రాల్లో ఆది పురుష్‌ ఒకటి. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ మైథలాజికల్‌ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్‌కు ఏళ్లు పడుతుందేమో అని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే ఆశ్చర్యకరంగా దర్శకుడు 103 రోజుల్లోనే ఆది పురుష్‌ షూటింగ్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో పాటు పలు టెక్నికల్‌ వర్క్స్‌తో మూవీ టీం ఫుల్‌ బిజీగా ఉంది.

చదవండి: Bholaa Shankar: ఊర మాస్‌గా చిరు.. లుక్‌ అదిరిందిగా

ఈ నేపథ్యంలో ఈ రోజు శివ రాత్రి సందర్భంగా దర్శకుడు ఓం రౌత్‌ ఆది పురుష్‌ నుంచి బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు.అంతేకాకుండా.. ఈ చిత్రాన్ని 3D వెర్షన్‏లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు మేకర్స్‌ అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

చదవండి: విజయ్‌తో పెళ్లి వార్తలపై తొలిసారి నోరు విప్పిన రష్మిక, ఏం చెప్పిందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement