వైరల్‌: ప్రభాస్ ఫోటో షేర్‌‌ చేసిన ఛార్మి | Prabhas And Charmme Kaur Doggo In Same Pic Wins Instagram | Sakshi
Sakshi News home page

వైరల్‌: ప్రభాస్ ఫోటో షేర్‌‌ చేసిన ఛార్మి

Published Wed, Nov 11 2020 11:23 AM | Last Updated on Wed, Nov 11 2020 2:19 PM

Prabhas And Charmme Kaur Doggo In Same Pic Wins Instagram - Sakshi

నిర్మాతగా మారిన నటి ఛార్మి కౌర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏం పోస్టు చేసిందంటే.. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు చెందిన ఫోటోను ఛార్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ ఫోటోలో ప్రభాస్‌తోపాటు ఛార్మి పెంపుడు కుక్క ఉంది. ‘నా తొమ్మిది నెలల బేబీ బాయ్ ‌(కుక్కతో) డార్లింగ్‌ ప్రభాస్’‌ అంటూ కామెంట్‌ చేశారు. ఈ పెంపుడు కుక్క వయస్సు తొమ్మిది నెలలే అయినప్పటికీ చూడటానికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇది అలాస్కస్‌ మాలమ్యూట్‌ జాతికి చెందినది. ఈ ఫోటోపై ప్రభాస్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డార్లింగ్‌ ఫోటో షేర్‌ చేసినందుకు ఛార్మీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. చదవండి: ప్రబాస్‌ సినిమాకు ముప్పై కోట్లతో సెట్‌ 

కాగా ఈ ఫోటో ముంబైలోని దర్శకుడు పూరి జగన్నాథ్‌ కార్యాలయంలో తీసిన ఫోటో. ఇటీవల ఇటలీలో ‘రాధే శ్యామ్’‌ చిత్రీకరణ పూర్తిచేసుకొని ఇండియా వచ్చిన ప్రభాస్‌ ముంబైకు వెళ్లారు. పని నిమత్తం అక్కడకు వెళ్లిన డార్లింగ్‌ అనంతరం పూరి కరెక్ట్స్‌ ఆఫీస్‌కు వెళ్లి, అక్కడ ఛార్మి పెంపుడు కుక్కతో కాసేపు సరదాగా గడిపినట్లు సమాచారం. ఇక త్వరలోనే హైదరాబాద్‌ చేరుకొని తిరిగి రాధేశ్యామ్‌ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమలో ప్రభాస్కుకి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఛార్మి, ప్రభాస్‌ రెండు చిత్రాలు చక్రం, పౌర్ణమి సినిమాల్లో నటించారు. అలాగే పూరి జగన్నాథ్‌తోనూ ఏక్‌ నిరంజన్‌, బుజ్జిగాడు సినిమాల్లో కలిసి పనిచేశారు. చదవండి: పవన్‌ చేతుల మీదుగా ‘గమనం’ ట్రైలర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement