బాహుబలి చిత్రాలతో ప్రభాస్ నేషనల్ స్టార్‌గా మారాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోల్లో అందరికంటే ముందున్నాడు. బాహుబలి 2 తర్వాత పాన్ ఇండియా మార్కెట్‌లో వదిలిన సాహో, రాధేశ్యామ్ డిజాస్టర్స్‌గా మిగిలాయి. అయినా కూడా ప్రభాస్ ఇమేజ్ తగ్గలేదు. ఆయనతో సినిమాలు చేయడానికి పాన్ ఇండియా దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఈ నేపథ్యంలో తన పారితోషికాన్ని భారీగా పెంచేశాడట ప్రభాస్. ఇప్పటివరకు రూ. 100 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకునే ప్రభాస్... ఇప్పుడు అదనంగా రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. అంటే ఒక్కో సినిమాకు రూ.120 కోట్లు తీసుకుంటున్నాడన్న మాట. ప్రభాస్ పెంచిన హైక్ ఆల్రెడీ సెట్స్ పై ఉన్న సినిమాలకు కూడా అప్లై అవుతుందట.
(చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోన్న ‘బ్రహ్మాస్త్ర’!)
అదే నిజమైతే ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె నిర్మాతలు ప్రభాస్ కు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.పాన్ ఇండియా మార్కెట్లో సినిమా క్లిక్ అయితే వెయ్యి కోట్లు గ్యారెంటీ అనే విషయాన్ని ఆర్ ఆర్ ఆర్, కేజీయఫ్ 2 చిత్రాలు నిరూపించాయి. ఆదిపురుష్, సలార్ లాంటి ప్రాజెక్ట్స్‌కు హిట్ టాక్ వస్తే.. వెయ్యి కోట్లు చాలా సులువు అని,అందుకే ప్రభాస్ రెమ్యూనరేషన్ పెంచాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment