స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు అనేది ఇచ్చే నిర్మాతలకు, తీసుకునే హీరోలకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి పారితోషికానికి సంబంధించిన గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా దక్షిణాదికి చెందిన ముగ్గురు స్టార్ హీరోల రెమ్యునరేషన్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
రజనీకాంత్ చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తలైవా తెరపై కనిపిస్తే చాలు.. కలెక్షన్ల వర్షం కురుస్తుంది. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా తొలి మూడు రోజులైతే బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది. ఆరేంజ్‌లో వెండితెరను శాసిస్తాడు కాబట్టే రెమ్యునరేషన్ కూడా చుక్కలను తాకుతుంది. రీసెంట్‌గా తలైన పారితోషికం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ‘జైలర్’ మూవీ కోసం రజనీకాంత్ ఏకంగా రూ.140 కోట్లు తీసుకుంటున్నాడట. దక్షిణాదికి చెందిన హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్‌లో రజనీకాంత్ నెంబర్ వన్ అని టాక్. ఒకవేళ సినిమా ప్లాఫ్ అయితే.. రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చే స్టార్ కూడా తలైవానే.
(చదవండి: మళ్లీ అదే మోసం.. ఆశలన్నీ ‘లైగర్’పైనే)
ఇక రజనీకాంత్ తర్వాత అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న హీరోలలో పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ ముందున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సౌత్‌లో కంటే నార్త్‌లోనే ప్రభాస్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. ఆయన నటించిన సాహో చిత్రం సౌత్‌లో డిజాస్టర్‌గా నిలిచినా.. నార్త్‌లో మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో బీటౌన్‌లో ప్రభాస్‌కు డిమాండ్ పెరిగింది. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా కోసం ఏకంగా రూ.125 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోలేదు.
(చదవండి: ఆస్కార్ బరిలో ఎన్టీఆర్.. లిస్ట్ బయటికొచ్చేసింది!)
ఇక వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో ‘దళపతి’ విజయ్ కూడా చేరాడు. ‘తుపాకి’ తర్వాత ఆయన నటించిన ప్రతి సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా భారీ కలెక్షన్లనే రాబట్టాయి. దీంతో విజయ్ కూడా తన పారితోషికాన్ని పెంచేశాడట. తాజాగా ఆయన నటిస్తున్న ‘వారసుడు’ చిత్రానికి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురి సినిమాలకు భారీగా కలెక్షన్స్ వస్తుండటంతో నిర్మాతలు కూడా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment