డార్లింగ్ ప్రభాస్ 'కల్కి'.. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. అందుకు తగ్గట్లే ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. తెలంగాణలో టికెట్ రేట్ల గురించి క్లారిటీ వచ్చేసింది. ఆంధ్రలో ధరలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదంతా పక్కనబెడితే 'కల్కి' ఓటీటీ డీటైల్స్ గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడు స్ట్రీమింగ్ కావాలనేది ముందు డీల్ సెట్ చేసుకున్నారట.
(ఇదీ చదవండి: తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?)
ఓటీటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత థియేటర్లలో రిలీజైన సినిమాలు.. నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్నిసార్లయితే ఒకటి రెండు వారాల్లోనే వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల విషయంలోనూ ఇలానే జరుగుతుంది. దీంతో 'కల్కి' నిర్మాతలు ముందే సదరు ఓటీటీ సంస్థలతో డీల్ మాట్లాడుకున్నారట.
సినిమా ఫలితం ఏదైనా సరే 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇకపోతే 'కల్కి' సినిమా దక్షిణాది భాషల హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, హిందీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎనిమిది వారాల గ్యాప్ అనేది మంచిది. దీని వల్ల ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూడకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు థియేటర్లకి వెళ్లి ఎక్స్‌పీరియెన్స్ చేయాలి లేదంటే ఓటీటీలోకి వచ్చేవరకు ఎదురు చూడాలి.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)
Comments
Please login to add a commentAdd a comment