పెద్ద యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది ‘రాధేశ్యామ్’ టీమ్. స్క్రీన్ మీద ఈ యాక్షన్ పండగలా ఉంటుందని కూడా అంటోంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ పీరియాడికల్ ప్రేమకథా చిత్రానికి రాధాకష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకష్ణ మూవీస్ నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా కోసం ఓ భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు.
నెల రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. ఈ విషయం గురించి దర్శకుడు రాధాకష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సన్నివేశాలను పూర్తి చేయడానికి సుమారు వెయ్యి మంది వంద రోజుల పాటు శ్రమించారు. అందరి సహకారం వల్ల రెండేళ్ల కల నెల రోజుల్లో నిజంగా మారింది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్, కెమెరామేన్ మనోజ్ పరమహంస, యాక్షన్ డైరెక్టర్ నిక్ పోవెల్, అలానే నిర్మాతలకు ప్రత్యేక కతజ్ఞతలు. ఇంతకు ముందెప్పుడూ చూడని యాక్షన్‌ను, సాహసాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment