ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళా విద్యార్థికి సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. విదేశాల్లో పై చదువులు పూర్తి చేయాలన్న ఆమె కలను నెరవేర్చేందుకు మార్గం సుగమం చేశారు. పశ్చిమ గోదావరికి చెందిన తిగిరిపల్లి శ్రీ చందన తండ్రి 9 ఏళ్ల క్రితమే మరణించాడు. చదువులో ఫస్టు ఉన్న ఆమెను ఇంటిసభ్యులు నానా కష్టాలు పడి కంప్యూటర్ సైన్స్ వరకు చదివించారు. తర్వాత ఆమె యూకేలోని మాంచెస్టర్ సిటీలో ఉన్న ప్రముఖ సాల్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు ఎంపికైంది. అందుకు ఆమె తొలుత ఎగిరి గంతేసినా తర్వాత కుటుంబ పరిస్థితి గుర్తుకు వచ్చి ఆశలను చంపుకుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రకాశ్ రాజ్ ఆమెను చదివించేందుకు ముందుకు వచ్చారు. (చదవండి: లక్ష్మీభాయ్ పాత్ర చేస్తే లక్ష్మీభాయ్ అయిపోతారా?)
యూకేలో నివసించేందుకు అవసరమైన డబ్బుతో పాటు ట్యూషన్ ఫీజును కూడా అందించారు. ఆయన చేసిన సాయానికి ఉబ్బితబ్బిబైపోయిన చందన కుటుంబంతో సహా ప్రకాశ్ రాజ్‌ను కలిసి ఆయనకు ధన్యవాదాలు తెలిపింది. ఒక తండ్రిగా తనను చదివిస్తున్నందుకు ఎంతగానో సంతోషించింది. కాగా లాక్‌డౌన్ కాలంలో ఆపద్భాందవుడిగా మారిన నటుడు సోనూసూద్‌తో కలిసి ప్రకాశ్ రాజ్ కూడా వలస కార్మికులకు తన వంతు సాయం అందించి అండగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరూ 'అల్లుడు అదుర్స్' అనే చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. (చదవండి: అభిమాని కల నెరవేర్చిన అల్లు అర్జున్!)
Comments
Please login to add a commentAdd a comment