
Producer Balaji Sensational Comments On Rashmi Gautam: యాంకర్ రష్మి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్‌గా దూసుకుపోతోంది. మొదట సినిమాల్లో సహానటి పాత్రలతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన రష్మీ.. ఆ తర్వాత యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలో ప్రముఖ కామెడీ షోతో యాంకర్‌గా మారిన ఆమె సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత పాపులర్ అయ్యింది. ఈ నేపథ్యంలో సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేస్తోంది. ఇప్పటికే ఆమె గుంటూర్ టాకీస్, అంతం వంటి చిత్రాల్లో మహిళ లీడ్‌రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రష్మీపై సీనియర్ నిర్మాత బాలజీ నాగలింగం షాకింగ్ కామెంట్స్ చేశాడు.
చదవండి: Radhe Shyam OTT Release: అప్పుడే ఓటీటీకి రాధేశ్యామ్, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓ సినిమా విషయంలో రష్మి తనను ఇబ్బంది పెట్టిందంటూ ఆరోపణలు చేశాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన.. ‘‘రాణి గారి బంగ్లా మూవీ సమయంలో తాను రష్మీని బెదిరించానని, అలా ఎందుకు చెయాల్సి వచ్చిందో వివరించాడు. ఈ మేరకు ఆయన మట్లాడుతూ.. ‘రాణి వారి బంగ్లా మూవీ రష్మీ సంతకం చేసింది. అయితే ఈ మూవీ షూటింగ్ నేపథ్యంలో ఓ పాట డబ్బింగ్‌కు వచ్చేసరికి తాను చేయనంటూ ఇబ్బంది పెట్టింది. అంతేకాదు హీరోని మార్చాలంటూ డిమాండ్ చేసింది. ఇదే విషయంపై తనని ఒప్పించేందుకు ప్రయత్నిస్తుండగా చాలా దురుసుగా వ్యవహరించింది. అ క్రమంలో ‘నాకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు’ అంటూ నన్ను బెదిరించింది’’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ అసహనం
ఆ తర్వాత తాను కూడా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నానని, తనకు కూడా నాగబాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి ఎంతొమంది తెలుసు అన్నానని పేర్కొన్నాడు. ఎక్కడికైనా వచ్చి మాట్లాడేందుకు సిద్ధమేనని రష్మీతో అన్నట్లు చెప్పాడు. మూవీ మధ్యలో వదిలిస్తే తనపై న్యాయపరమైన చర్యలు దిగుతానని, అలాగే ఫిల్మ్ చాంబర్ గేటుకు కట్టివేస్తానని బెదిరించడంతో రష్మీ దిగొచ్చి మిగతా షూటింగ్ పూర్తి చేసిందని ఆయన తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన ‘నా వయస్సు ఎంత.. ఆమె వయస్సు ఎంత.. ఇలా మాట్లాడొచ్చా’ అని మండిపడ్డాడు. అంతేకాదు రష్మీ తనతో మాట్లాడిన రికార్డింగ్ ఇప్పటికీ తన దగ్గర ఉందని చెప్పాడు. న్యాయం కోసమే ఆమెను ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టివేస్తానని బెదిరించానని, ఉద్దేశపూర్వంగా చేసిన వ్యాఖ్యలు కాదన్నాడు. అయితే రష్మీ మంచి ఆర్టిస్ట్ అని, సినిమా చేస్తున్నంత సేపు తను సెకండ్ టెక్ తీసుకోలేదంటూ చివరగా ప్రశంసించాడు.
Comments
Please login to add a commentAdd a comment