'డైరక్టర్‌ కన్నా నిర్మాతలకే కష్టాలు ఎక్కువ' | Producing Is Difficulty Than Directing A Film Says Kollywood Producer Raja | Sakshi
Sakshi News home page

'డైరక్టర్‌ కన్నా నిర్మాతలకే కష్టాలు ఎక్కువ'

Aug 5 2021 5:25 PM | Updated on Aug 5 2021 9:14 PM

Producing Is Difficulty Than Directing A Film Says Kollywood Producer Raja - Sakshi

చెన్నై: చిత్రానికి దర్శకత్వం వహించడం చాలా సులభమని, అయితే దానిని నిర్మించడం చాలా కష్టతరం అని దర్శకుడిగా అవతారమెత్తిన నిర్మాత వి.రాజా పేర్కొన్నారు. ఇంతకుముందు అరువా సండై చిత్రాన్ని నిర్మించి కథానాయకుడిగా నటించిన ఈయన తాజాగా దర్శకుడుగా మెగాఫోన్‌ పట్టి నిర్మిస్తున్న చిత్రం భార్గవి. ముఖేష్, శ్రియ అనే నవ జంటను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది.

దర్శక, నిర్మాత వి.రాజా పుట్టినరోజు సందర్భంగా గత ఒకటవ తేదీన ఈ చిత్ర టైటిల్‌ను నటుడు విజయ్‌సేతుపతి ఆవిష్కరించారు. చిత్ర నిర్మాణం గురించి వి.రాజా మాట్లాడుతూ చిత్రాలకి దర్శకత్వం వహించడం చాలా సులభమని అయితే దానిని నిర్మించడం చాలా కష్టతరం అని పేర్కొన్నారు. ఈ రంగంలో తనకున్న అనుభవంతో పాండి సెల్వ, రాజి, గోపి వంటి అనుభవం కలిగిన దర్శకులను సహదర్శకులుగా చేర్చుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement