ఏపీలో 'పుష్ప2' టికెట్‌ ధరలు పెంపు.. అల్లు అర్జున్‌ ట్వీట్‌ | Pushpa 2 The Rule Movie Ticket Rates Hiked By Andhra Pradesh Govt, Allu Arjun Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: ఏపీలో 'పుష్ప2' టికెట్‌ ధరలు పెంపు.. అల్లు అర్జున్‌ ట్వీట్‌

Published Tue, Dec 3 2024 7:46 AM | Last Updated on Sat, Dec 7 2024 1:09 PM

Pushpa 2 Ticket Rates Hike In Andhra Pradesh Govt

ఏపీలో  'పుష్ప2' టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ  ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సౌలభ్యం కల్పించిన విషయం తెలిసిందే. పుష్ప టికెట్ల ధరల విషయంపై ఏపీ అధికారికంగా జీవో విడుదల చేయడంతో అ‍ల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు. డిసెంబర్‌ 5న విడుదల కానున్న పుష్ప చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

పుష్ప2 నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు పెంచుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణలో మాదిరే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోలకు అనుమతి ఇచ్చింది. ఈ రెండు బెనిఫిట్ షోలకుగాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌లలో ఏదైనా సరే టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు. ఈ ధరకు జీఎస్‌టీ అధనంగా ఉంటుంది.

అయితే, డిసెంబర్ 5న ఆరు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్స్‌లలో లోయర్‌ క్లాస్‌ రూ.100, అప్పర్‌ క్లాస్‌ రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. ఇక్కడ కూడా జీఎస్టీతో కలిపి టికెట్లు కొనాల్సి ఉంటుంది. ఈ ధరలు అన్నీ కూడా ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలకు అదనంగా యాడ్‌ అవుతుంది. డిసెంబరు 17 వరకు మాత్రమే పెంచిన ధరలు వర్తిస్తాయి. పుష్ప కోసం టికెట్‌ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసిన తర్వాత అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లకు ఆయన  కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణలో టికెట్ల ధరలు ఇలా
పుష్ప-2 సినిమా టికెట్ల ధరల పెంపు, అదనపు షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సినిమా విడుదల ముందురోజు అంటే డిసెంబర్‌  4న రాత్రి 9.30 గంటల నుంచి ప్రదర్శించే బెన్‌ఫిట్‌ షోకు అన్ని రకాల స్క్రీన్లలో రూ.800 పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చింది. డిసెంబర్‌ 5వ తేదీ నుంచి 8 వరకు సింగిల్‌ స్క్రీన్లలో టికెట్‌ ధరలు రూ.150, మల్టీఫ్లెక్స్‌లలో రూ. 200 పెంచుకోవచ్చని తెలిపింది. 

అయితే, డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్స్‌లలో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఉంది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement