రష్మిక ఫస్ట్‌లుక్‌ ఎక్కడంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌‌‌ | Pushpa Movie : Rashmika Mandanna Fans Fires On Sukumar | Sakshi
Sakshi News home page

రష్మిక ఫస్ట్‌లుక్‌ ఎక్కడంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌‌‌‌‌

Published Tue, Apr 6 2021 6:43 PM | Last Updated on Tue, Apr 6 2021 9:56 PM

Pushpa Movie : Rashmika Mandanna Fans Fires On Sukumar - Sakshi

అతి కొద్దికాలంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా మారింది హీరోయిన్‌ రష్మిక మందన్నా. వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. తెలుగులో ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన పాన్‌ ఇండియా మూవీ పుష్ప లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హీరో అల్లు అర్జున్‌ బర్త్‌డేకు వారం రోజుల ముందే సందడి చేస్తున్న పుష్ప టీం అసలు రష్మికను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆమె అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న(ఏప్రిల్‌5)న రష్మిక 25వ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ  సందర్భంగా పుష్ప టీం నుంచి సర్‌ప్రైజ్‌ ఆశించిన రష్మిక ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది.

పుష్ప నుంచి రష్మిక ఫస్ట్‌ లుక్‌ను ఇంత వరకు రిలీజ్‌ చేయలేదు. దీంతో  చిత్ర యూనిట్‌పై రష్మిక అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. చిత్ర యూనిట్‌ హీరోయిన్‌ను అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప సినిమా లో రష్మిక లుక్‌ ఎలా ఉంటుందోనని వెయిట్‌ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో రష్మిక పూర్తి డీ గ్లామరెస్‌ రోల్‌లో పల్లెటూరు అమ్మాయిగా కనిపించనున్నట్లు సమాచారం. 

మరోవైపు అల్లు అర్జున్‌ పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే అంటే ఈనెల 7న సాయంత్రం 6.12 గంటలకు పుష్పరాజ్‌ను విజువల్‌గా పరిచయం చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ వారం 'పుష్ప' చిత్రం నుంచి మరిన్ని అప్ డేట్స్ వస్తున్నాయని, అభిమానులు సిద్ధంగా ఉండాలని వెల్లడించింది. ఇక పుష్ప డబ్బింగ్‌ మొదలైపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలను చిత్ర బృందం విడుదల చేసింది. ఇటీవలె మాల్దీవుల ట్రిప్‌కు వెళ్లిన అల్లు అర్జున్‌..తాజాగా డబ్బింగ్‌లో పాల్గొన్నారు. 

చదవండి : 'లోడు దింపతాండాం'.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండుగే
రష్మిక ఫస్ట్‌ ఆడిషన్‌: వీడియో రిలీజ్‌ చేసిన మాజీ ప్రియుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement