వింటేజ్ లుక్‌లో రజనీకాంత్ మరోసారి అదరగొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. రజనీ లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’ లొకేషన్ ఫొటోను షేర్ చేసింది ఈ చిత్ర నిర్మాణసంస్థ సన్ పిక్చర్స్. ఈ ఫొటోను చూసిన తలైవా (నాయకుడు) ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. దాదాపు నెల రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ శాతం పూర్తవుతుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ‘అన్నాత్తే’లో నయనతార, కీర్తీ సురేష్, ఖుష్బూ, మీనా కీలక పాత్రలు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబరు 4న ఈ సినిమా విడుదల కానుంది.
#Annaatthe from the shooting spot.@rajinikanth @directorsiva #Nayanthara @KeerthyOfficial @immancomposer pic.twitter.com/1cb9tSCMgM
— Sun Pictures (@sunpictures) April 12, 2021
Comments
Please login to add a commentAdd a comment