Rajkummar Rao And Sanya Malhotra Hit Movie New Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Hit The First Case Release Date: 'హిట్‌' రీమేక్‌ రిలీజ్‌ డేట్‌ మార్చిన మూవీ టీం

Published Fri, May 13 2022 6:12 PM | Last Updated on Fri, May 13 2022 6:27 PM

Rajkummar Rao Sanya Malhotra Hit Movie Gets New Release Date - Sakshi

యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ హిట్‌.  శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా హిందీలో రీమేక్‌ అవుతుంది. రాజ్ కుమార్ రావు,దంగ‌ల్ ఫేం స‌న్యా మ‌ల్హోత్రా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఈనెల 20న విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమా విడుదలను మరో తేదీకి మారుస్తూ రిలీజ్‌ డేట్‌ను ఫైనల్‌ చేసింది మూవీ టీం. ఈ విషయాన్ని హీరోయిన్‌ స‌న్యా మ‌ల్హోత్రా సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. కాగా ఈ చిత్రాన్ని క్రిష‌న్‌కుమార్‌, కుల్‌దీప్ రాథోడ్‌లతో కలిసి దిల్‌రాజు నిర్మిస్తున్నారు.  మాన‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement