'డై హార్డ్‌ ఫ్యాన్‌' నుంచి సాంగ్‌ రిలీజ్‌ చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ | Rakul Preet Singh Launches Paruge Parugu Song From Die Hard Fan Movie | Sakshi
Sakshi News home page

'డై హార్డ్‌ ఫ్యాన్‌' నుంచి సాంగ్‌ రిలీజ్‌ చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Published Sun, Aug 7 2022 8:53 PM | Last Updated on Sun, Aug 7 2022 8:56 PM

Rakul Preet Singh Launches Paruge Parugu Song From Die Hard Fan Movie - Sakshi

ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి జంట‌గా నటిస్తున్న చిత్రం డై హార్డ్‌ ఫ్యాన్‌. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం. అభిరామ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షక‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ ముఖ్య‌పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ సస్పెన్స్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉంది. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తేజుద్దీన్ మాటలు రాస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలోని పరుగే పరుగు పాటను స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విడుదల చేసింది. అనంతరం ఈ పాట చాలా అద్భుతంగా ఉందని, సౌండింగ్‌ అదిరిపోయిందని తెలిపింది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను త్వరలోనే అనౌన్స్‌ చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement