తెరకెక్కనున్న రామ్‌ గోపాల్‌ వర్మ బయోపిక్‌ | Ram Gopal Varma Biopic will Be in Three Parts | Sakshi
Sakshi News home page

తెరకెక్కనున్న రామ్‌ గోపాల్‌ వర్మ బయోపిక్‌

Published Tue, Aug 25 2020 8:46 PM | Last Updated on Tue, Aug 25 2020 9:44 PM

Ram Gopal Varma Biopic will Be in Three Parts - Sakshi

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అంటేనే సంచలనం. ఇప్పటి వరకు రకరకాల బయోపిక్‌లు, రియల్‌ స్టోరీలను తెరకెక్కిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా రామ్‌గోపాల్‌ వర్మ తన జీవితాన్నే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను బొమ్మాకు క్రియేషన్స్‌ సంస్థ తెరకెక్కిస్తుంది. ఈ విషయాన్ని రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాను మూడు భాగాలుగా, మూడు చిత్రాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని దొరసాయి తేజ అనే ఒక నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.ఇందుకు సంబంధించిన షూటింగ్‌ సెప్టెంబర్‌ లో మొదలవుతుందని వర్మ తెలిపారు.  ప్రతి పార్ట్‌ రెండు గంటల పాటు ఉండబోతున్నట్లు వర్మ తెలిపారు. 

దీని గురించి వర్మ చెబుతూ, ‘ 3 పార్టుల్లో ,ఒక్కొక్క పార్టు నా వేరు వేరు వయసుల్లో  వేరు వేరు  అంశాలను చూపెట్టబోతోంది. పార్ట్ 1లో నా 20 ఏళ్ళప్పటి  రోల్‌లో  ఒక కొత్త నటుడు నటించబోతున్నాడు.  పార్ట్  2 లో వేరే నటుడు, పార్ట్ 3 లో నేనే నాలా గా   నటించబోతున్నా’ అని తెలిపారు. రామ్‌ గోపాల్‌ వర్మను ఎంతో మంది ఫాలో అవుతుంటారు. వాళ్లందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. 
పార్ట్‌ 1 పేరు రాము అని పెట్టనున్నారు. ఈ పార్ట్‌లో రామ్‌ గోపాల్‌ వర్మ కాలేజ్  రోజులు, తోలి ప్రేమలు, గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నారన్నది చూపించబోతున్నట్లు వర్మ చెప్పారు. 

ఇక రెండవ భాగం పేరు ‘రామ్‌ గోపాల్‌ వర్’ గా నిర్ణయించారు. ఇందులో రామ్ గోపాల్ వర్మ అండర్‌ వరల్డ్‌ ప్రేమాయణం  గురించి చూపించనున్నారు.  ఇందులో వర్మకు ముంబై జీవితంలో సంబంధం ఉన్న అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ ,అమితాబ్ బచ్చన్ లతో ఉన్న  అనుబంధాల గురించి చూపించవున్నారు. ఇక పార్ట్‌ 3లో ‘ఆర్‌జీవీ’ —ది ఇంటెలిజెంట్ ఇడియట్  పేరుతో తెరకెక్కనుంది. దీనిలో వర్మ ఫెయిల్యూర్స్‌, వివాదాలు, దేవుళ్ల పట్ల, సెక్స్‌ పట్ల, సమాజం పట్ల తనకున్న విపరీత వైఖరుల గురించి చూపించనున్నారు. 

చదవండి: వ‌ర్మ‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దు: హైకోర్టు


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement