
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అవుతుంది. అయినా ఇవేవి పట్టించుకోని వర్మ తనకు నచ్చిందే చేస్తాడు. వివాదాలు, సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఆయన తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్‌ను త్వరలోనే తీస్తానని ప్రకటించారు. డేంజరస్ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆర్జీవీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలపై చర్చించారు.
ఏపీ టికెట్ రేట్ల విషయంలో తనకు ఇబ్బంది లేదని అలాగే తన సినిమాను ఓటీటీ, థియేటర్ రెండింటిలోనూ విడుదల చేస్తామన్నారు. అలాగే తనకు 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం బాగా నచ్చిందని, త్వరలోనే కేసీఆర్ బయోపిక్ తీస్తానని వెల్లడించాడు. దీనికి సంబంధించిన త్వరలోనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment