Ram Gopal Varma Interesting Comments on Dangerous Movie - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమకు ప్రభుత్వమే అనుమతిచ్చింది

Published Thu, Mar 31 2022 10:01 AM | Last Updated on Thu, Mar 31 2022 11:38 AM

Ram Gopal Varma Interesting Comments On Dangerous Movie - Sakshi

సంప్రదాయాలను బ్రేక్‌ చేయాలనే కాదల్‌ కాదల్‌ దాన్‌ చిత్రం తీసినట్లు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ అన్నారు. ఈయన హిందీలో రూపొందించిన డేంజరస్‌ చిత్రానికి తమిళ అనువాదమే కాదల్‌ కాదల్‌ దాన్‌. నటి నైనా గంగూలి, అప్సర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తమిళనాడులో ఏప్రిల్‌ 8వ తేదీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా బుధవారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ, హీరోయిన్లు నైనా గంగూలి అప్సర, చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంగోపాల్‌ వర్మ మాట్లాడుతూ ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ, సాన్నిహిత్యాలకు ప్రభుత్వమే అనుమతినిచ్చిందన్నారు. అలాంటి వారిని సమాజం వేరే విధంగా చూస్తోందన్నారు. అలాంటి సమాజాన్ని బ్రేక్‌ చేయాలనే తాను ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.

చదవండి: ఆస్కార్‌ వేడుకల్లో కమెడియన్‌పై చెంపదెబ్బ.. విల్‌ స్మిత్‌పై చర్యలు !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement