'జాతిరత్నాలు' డైరెక్టర్‌తో హీరో రామ్‌ సినిమా! | Ram Pothineni Movie With Jathi Ratnalu Director KV Anudeep | Sakshi
Sakshi News home page

కాంబినేషన్‌ సెట్‌?

Published Sun, Apr 11 2021 8:11 AM | Last Updated on Sun, Apr 11 2021 8:18 AM

Ram Pothineni Movie With Jathi Ratnalu Director KV Anudeep - Sakshi

తొలి చిత్రం ‘జాతిరత్నాలు’తోనే సూపర్‌హిట్‌ సాధించారు దర్శకుడు కేవీ అనుదీప్‌. ద్వితీయ ప్రయత్నంలో కూడా సక్సెస్‌ కావాలని ఓ అద్భుతమైన కథను రెడీ చేసుకుని, హీరో రామ్‌కు వినిపించారట. ఈ కథకు రామ్‌ ఇంప్రెస్‌ అయి, బౌండ్‌ స్క్రిప్ట్‌తో రావాలని అనుదీప్‌ను కోరారట. మరి.. రామ్‌ హీరోగా అనుదీప్‌ డైరెక్షన్‌లో సినిమా ఉంటుందా? ఈ కొత్త కాంబినేషన్‌ సెట్స్‌ వరకు వెళుతుందా? వేచి చూడాల్సిందే. 

ఇదిలా ఉంటే అనుదీప్‌-వైష్ణవ్‌ తేజ్‌ కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ పడిందట. ఇప్పటికే నిర్మాత బీవీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ఈ ప్రాజెక్ట్‌కు అడ్వాన్స్‌ కింద కొంత మొత్తం కూడా చెల్లించాడట. ప్రస్తుతం వైష్ణవ్‌ క్రిష్‌ జాగర్లమూడితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ పూర్తయిన వెంటనే అనుదీప్‌ వైష్ణవ్‌ మూడవ సినిమాను సట్స్‌పైకి తీసుకేళ్లనున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: అమెజాన్‌లో జాతిరత్నాలు: నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత!

డిసప్పాయింట్ అయిన రష్మిక.. ఎందుకిలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement