టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి మరికొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. రానా-మిహికాల వివాహం ఆగస్టు 8న జరగనుంది. ఇప్పటికే వీరి పెళ్లి పత్రిక తెగ ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో రానా ఓ ఆంగ్లమీడియా ఇంటర్వ్యూలో తనకు కాబోయే శ్రీమతి మిహికా బజాజ్ గురించి, వారి బంధం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. ‘మిహికా, మేం ఒకే ప్రాంతంలో ఉండేవాళ్లం. మా ఇంటి నుంచి తన ఇంటికి కేవలం మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే. వివాహం చేసుకోవడానికి నేను చాలా వింతైన సమయాన్ని ఎన్నుకున్నాను’ అన్నారు.
‘పెద్దవాడిని అయ్యాను పెళ్లి చేసుకోవాడానికి ఇదే మంచి సమయం అనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. జీవితంలో కొన్ని సార్లు అన్ని సజావుగా సాగిపోతుంటాయి. అప్పుడు వాటి గురించి ఎలాంటి ప్రశ్నలు అడగను. తను చాలా మంచిది. మేం చాలా గొప్ప జంటగా నిలుస్తాం. ఒకరినుంచి ఒకరం సానుకూల అంశాలను స్వీకరిస్తాం. ఆగస్టు 8న నేను వివాహం చేసుకోబోతున్నాను. మిహికాతో వివాహం జరగడం అనేది నా వ్యక్తిగత జీవితంలో అత్యంత ఉత్తమమైన సమయం. ఈ ఆలోచన ఎంతో అద్భుతంగా ఉంది’ అన్నారు. (వేడుకలు ఆరంభం)
మిహికా, వెంకటేష్ కుమార్తె ఆశ్రిత క్లాస్‌మెట్. ఈ నేపథ్యంలో వీరిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం. అయితే లాక్‌డౌన్‌కు ముందే మిహికా యస్ చెప్పడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మే 12న రానా మిహికాతో ఉన్న ఫోటోను షేర్ చేసి.. తమ ప్రేమ గురించి ప్రపంచానికి తెలిపాడు. ఆ తర్వాత మే 21న వారి రోకా వేడుక జరిగింది. రానా మాట్లాడుతూ.. ‘కొన్ని నెలల క్రితం.. మిహికాతో తిరిగి కనెక్ట్ అయ్యాను. అప్పుడు లైఫ్‌లాంగ్ ఆమెతో సంతోషంగా ఉంటానని అర్థమయ్యింది. ఫోన్‌లో నేను ఏం అడగబోతున్నానో తనకు తెలుసు. అందుకే వ్యక్తిగతంగా కలిసి.. ముందు కొన్ని మంచి విషయాల గురించి మాట్లాడాను. తను మొదట షాక్ అయ్యింది.. కానీ సంతోషంగా ఉంది’ అని చెప్పారు. (బాహు.. భళ్లా... మళ్లా! )
Comments
Please login to add a commentAdd a comment