![Rashmika Mandanna Celebrates Birthday On Goodbye Set - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/6/rashmika.jpg.webp?itok=BJGR_lmi)
అమితాబ్ బచ్చన్, రష్మికా మందన్నా
ఈ ఏడాది జరుపుకొన్న పుట్టినరోజును ఎప్పటికీ మరచిపోలేనంటున్నారు రష్మికా మందన్నా. ఎందుకుంటే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకే రష్మికాకు ఇది నిజంగా ‘బిగ్’ బర్త్ డే. వికాశ్ బల్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ చిత్రం ‘గుడ్ బై’. ఈ వారమే ఈ సినిమా షూటింగ్ ముంబయ్‌లో మొదలైంది.
ప్రస్తుతం అమితాబ్, రష్మికలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మార్చి 5న రష్మికా మందన్నా పుట్టినరోజు. కానీ బర్త్ డే బ్రేక్ తీసుకోకుండా ‘గుడ్ బై’ చిత్రీకరణలో పాల్గొన్నారామె. లొకేషన్‌లో జరుపుకున్న పుట్టినరోజు వేడుక ఫొటోలను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సినిమా కాకుండా హిందీలో రష్మిక ‘మిషన్ మజ్ను’ అనే సినిమా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment