Rashmika Mandanna First Audition Video: వీడియో రిలీజ్‌ చేసిన మాజీ ప్రియుడు - Sakshi
Sakshi News home page

తడబడిన రష్మిక‌: వీడియో రిలీజ్‌ చేసిన మాజీ ప్రియుడు

Published Mon, Apr 5 2021 6:24 PM | Last Updated on Mon, Apr 5 2021 10:17 PM

Rashmika Mandanna First Audition Video Releases Rakshit Shetty - Sakshi

రష్మిక మందన్నా.. దక్షిణాదిలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ ఈమె. కన్నడ కిరిక్‌ పార్టీతో వెండితెరపై కాలు మోపిన ఈ భామ చలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ వెంటనే ఆమె చేసిన గీతాగోవిందం సూపర్‌ డూపర్‌ హిట్టైంది. ఇందులో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండను తన వెంట తిప్పించుకున్న ఈ మేడమ్‌ ఎంతోమంది అబ్బాయిలకు క్రష్‌గా మారింది. మిషన్‌ మజ్నుతో హిందీలో అడుగు పెడుతున్న ఈ హీరోయిన్‌ అమితాబ్‌తో గుడ్‌బై సినిమా చేస్తోంది. ఇదిలా వుంటే ఈ భామ కిరిక్‌ పార్టీ ఆడిషన్స్‌లో పాల్గొన్న వీడియోను నటుడు రక్షిత్‌ శెట్టి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

"కిరిక్‌ పార్టీ ఆడిషన్‌లోని మధురానుభూతులను షేర్‌ చేస్తున్నాను. అప్పటి నుంచి నీ ప్రయాణం ఎంతో దేదీప్యమానంగా సాగింది. నిజమైన యోధురాలిలా నీ కలలను చేధించావు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే. నువ్వు మరెన్నో విజయాలు సాధించాలి.." అని రాసుకొచ్చాడు. దీనిపై రష్మిక స్పందిస్తూ.. "అప్పటి క్షణాలు నాకింకా గుర్తున్నాయి. థ్యాంక్‌ యూ సో మచ్‌" అని బదులిచ్చింది. ఇక ఈ వీడియోలో కళ్లజోడు పెట్టుకున్న రష్మిక పేపర్‌లో ఉన్న డైలాగ్స్‌ నేర్చుకుంటూ అప్పజెబుతోంది. అలాగే అక్కడున్న వారితో నవ్వుతూ మాట్లాడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇదిలావుంటే రష్మిక బర్త్‌డేను పురస్కరించుకుని 'పుష్ప', 'ఆడాళ్లు మీకు జోహార్లు' సినిమాలు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ హీరోయిన్‌ మాత్రం తన బర్త్‌డే రోజు కూడా షూటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. ప్రస్తుతం ఆవిడ అమితాబ్‌ బచ్చన్‌ 'గుడ్‌బై' సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉంది. కాగా 'కిరిక్‌ పార్టీ' హీరో రక్షిత్‌ శెట్టితో ప్రేమాయణం సాగించిన ఈ హీరోయిన్‌ ఆమధ్య పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమైంది. 2017లో వీళ్లిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ మరుసటి ఏడాదే విడిపోయారు.

చదవండి:  పుష్ప: శాంపిల్‌ వస్తోంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement