Rashmika Mandanna: యంగ్‌ హీరోతో రష్మిక రొమాన్స్‌! | Rashmika Will Act Heroine In Ram Pothineni And Boyapati Movie | Sakshi
Sakshi News home page

యంగ్‌లో హీరోతో బోయపాటి కొత్త మూవీ..హీరోయిన్‌గా రష్మిక!

Published Tue, Mar 15 2022 11:16 AM | Last Updated on Tue, Mar 15 2022 11:26 AM

Rashmika Will Act Heroine In Ram Pothineni And Boyapati Movie - Sakshi

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మీద శ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్‌కి జోడిగా ఏ హీరోయిన్‌ నటిస్తోంది, ఇతర కీలక పాత్రలు ఎవరెవరు పోషిస్తున్నారు అనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు.

ప్రస్తుతం బోయపాటి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల మీద దృష్టి పెట్టారట. అందులో భాగంగా సినిమాలో నటించే ఇతర నటులను ఎంపిక చేసే పనిలో పడ్డారట. ఇప్పటికే హీరోయిన్‌ని ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్‌ సరసన నేషనల్‌ క్రష్‌ రష్మిక నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బోయపాటి రష్మికకు కథ వినిపించాడని, ఆమెకు నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.

రామ్‌కి బాలీవుడ్‌లో కూడా మంచి డిమాండ్‌ ఉంది. ఆయన నటించిన సినిమాలు హిందీలో డబ్‌ అయి, యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ని అందుకున్నాయి. అలాగే పుష్పతో రష్మిక బాలీవుడ్‌ క్రష్‌గా మారింది. ఈ నేపథ్యంలో పాన్‌ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రష్మికను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక రష్మిక విషయానికొస్తే.. శర్వానంద్‌తో కలిసి నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం పుష్ప 3తో పాటు బాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement