RRR Movie Naatu Naatu Song: RRR Second Single, Naatu Naatu Full Lyrical Song Out - Sakshi
Sakshi News home page

RRR Naatu Naatu Song: మాస్‌ స్టెప్పులతో అదరగొట్టిన చెర్రి, తారక్‌

Published Wed, Nov 10 2021 3:34 PM | Last Updated on Wed, Nov 10 2021 4:16 PM

RRR Movie Second Single: Nattu Koothu Full Lyrical Song Out - Sakshi

RRR Movie Naatu Naatu Full Song Out: దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం.. రణం.. రుధిరం). యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌లు హీరోలుగా వస్తోన్న ఈ మూవీని భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్.. పెన్ స్టూడియోస్.. లైకా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా దీపావళికి ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. అది సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ పేరుతో తారక్‌, చెర్రిలకు సంబంధించిన ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

చదవండి: ఫాంహౌజ్‌ పేకాట కేసు: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్‌

‘నాటు.. నాటు’ అంటూ సాగే ఈ సాంగ్‌కు ఎన్టీఆర్‌, చరణ్‌లు ఊర మాస్‌ స్టేప్పులతో అదరగొట్టారు. ఎంఎం కీరవాణి స్వరాలు అందించిన ఈ పాటను రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆలపించారు. తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ భామా.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్‌లుక్‌ అంచనాలను మరింత పెంచేశాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement