మెగా అభిమానులకు పండగే.. ఆస్కార్‌ రేసులో రామ్‌చరణ్‌ | RRR Star Ram Charan Shortised In Oscars Variety Predictions 2023 List | Sakshi
Sakshi News home page

Ram Charan: మెగా అభిమానులకు పండగే.. ఆస్కార్‌ రేసులో రామ్‌చరణ్‌

Published Fri, Sep 16 2022 3:10 PM | Last Updated on Fri, Sep 16 2022 3:33 PM

RRR Star Ram Charan Shortised In Oscars Variety Predictions 2023 List - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'.  దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో తార‌క్ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టించగా, రామ్‌ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టించాడు.

బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. డివివి దాన‌య్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన‌ ఈ చిత్రంలో ఆలియాభ‌ట్,ఒలీవియా మోరిస్‌లు హీరోయిన్స్‌గా నటించారు. పాన్‌ ఇండియా స్థాయిలో పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇటీవలె  అమెరికాకు చెందిన‌ ప్ర‌ముఖ మూవీ పబ్లికేష‌న్స్ వెరైటీ.. ఆస్కార్‌-2023కి గానూ బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరిలో జూ ఎన్టీఆర్‌కి అవార్డు వచ్చే ఛాన్స్‌ ఉందని లిస్ట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో రామ్‌చరణ్‌ పేరు కూడా ఉన్నట్లు ఆ వెబ్‌సైట్‌ అంచనా వేసింది. అంతేకాకుండా బెస్ట్‌ డైరెక్టర్‌ క్యాటగిరిలో రాజమౌళికి ఆస్కార్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు జాబితా విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement