ఖైరతాబాద్ గణేశ్ దగ్గర కమల్ హాసన్ డ్యాన్స్.. ఏ సినిమానో తెలుసా? | Sagara Sangamam Kamal Haasan Dance At Khairatabad Ganesh | Sakshi
Sakshi News home page

Khairatabad Ganesh: అప్పట్లోనే తెలుగు మూవీలో ఖైరతాబాద్ వినాయకుడు

Published Tue, Sep 17 2024 1:42 PM | Last Updated on Tue, Sep 17 2024 2:55 PM

Sagara Sangamam Kamal Haasan Dance At Khairatabad Ganesh

హైదరాబాద్‌లో వినాయక చవితి అంటే అందరూ ఖైరతాబాద్ గణేశుడి గురించే మాట్లాడుకుంటారు. అంతలా పాపులార్ అయిపోయింది. ఈసారి కూడా లక్షలాది మంది భక్తులు ఈ మహా గణపతిని దర్శించుకున్నారు. తాజాగా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కూడా చేశారు. ఇంతలా పాపులర్ అయిన ఖైరతాబాద్ వినాయకుడని గతంలో ఓ తెలుగు సినిమాలో కూడా చూపించారని మీలో ఎంతమందికి తెలుసు?

హైదరాబాద్‌లో వినాయకుడు అంటే ఖైరతాబాద్ మాత్రమే అనేంతలా గుర్తింపు వచ్చింది. ఇందుకు తగ్గట్లే ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకని నిర్వహిస్తున్నారు. గతంలో అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర విలక్షణ నటుడు కమల్ హాసన్ డ్యాన్స్ వేశాడు. మీరు సరిగానే విన్నారు.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'దేవర'.. ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్?)

1983లో రిలీజైన 'సాగరసంగమం' సినిమా కమల్ హాసన్‍‌కి తెలుగు నాట ఎంత పేరు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఓ చోట ఖైరతాబాద్ వినాయకుడిని చూపిస్తారు. అక్కడ కమల్ క్లాసికల్ డ్యాన్స్ చేస్తాడు.

అయితే 1983లో జూన్‌లో 'సాగరసంగమం' సినిమా రిలీజైంది. ఆ ఏడాది సెప్టెంబరులో వినాయక చవితి వచ్చింది. రెండు చోట్ల ఉన్నది ఒకే వినాయకుడు. అంటే ఆ ఏడాది సినిమా కోసం చాలాముందుగానే గణేశుడి ప్రతిమ తయారు చేయించారనమాట. ఏదేమైనా అప్పట్లో ఖైరతాబాద్ వినాయకుడు సినిమాల్లో ఉన్నాడనమాట.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్‍.. ఆ మూడు కాస్త స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement