KHAIRATABAD Ganapathy
-
ఖైరతాబాద్ గణేశ్ దగ్గర కమల్ హాసన్ డ్యాన్స్.. ఏ సినిమానో తెలుసా?
హైదరాబాద్‌లో వినాయక చవితి అంటే అందరూ ఖైరతాబాద్ గణేశుడి గురించే మాట్లాడుకుంటారు. అంతలా పాపులార్ అయిపోయింది. ఈసారి కూడా లక్షలాది మంది భక్తులు ఈ మహా గణపతిని దర్శించుకున్నారు. తాజాగా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కూడా చేశారు. ఇంతలా పాపులర్ అయిన ఖైరతాబాద్ వినాయకుడని గతంలో ఓ తెలుగు సినిమాలో కూడా చూపించారని మీలో ఎంతమందికి తెలుసు?హైదరాబాద్‌లో వినాయకుడు అంటే ఖైరతాబాద్ మాత్రమే అనేంతలా గుర్తింపు వచ్చింది. ఇందుకు తగ్గట్లే ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకని నిర్వహిస్తున్నారు. గతంలో అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర విలక్షణ నటుడు కమల్ హాసన్ డ్యాన్స్ వేశాడు. మీరు సరిగానే విన్నారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'దేవర'.. ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్?)1983లో రిలీజైన 'సాగరసంగమం' సినిమా కమల్ హాసన్‌కి తెలుగు నాట ఎంత పేరు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఓ చోట ఖైరతాబాద్ వినాయకుడిని చూపిస్తారు. అక్కడ కమల్ క్లాసికల్ డ్యాన్స్ చేస్తాడు.అయితే 1983లో జూన్‌లో 'సాగరసంగమం' సినిమా రిలీజైంది. ఆ ఏడాది సెప్టెంబరులో వినాయక చవితి వచ్చింది. రెండు చోట్ల ఉన్నది ఒకే వినాయకుడు. అంటే ఆ ఏడాది సినిమా కోసం చాలాముందుగానే గణేశుడి ప్రతిమ తయారు చేయించారనమాట. ఏదేమైనా అప్పట్లో ఖైరతాబాద్ వినాయకుడు సినిమాల్లో ఉన్నాడనమాట.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్) -
70 ఏళ్లు.. 70 అడుగులు
ఖైరతాబాద్ (హైదరాబాద్): ఖైరతాబాద్‌లో 1954లో అడుగు ఎత్తుతో ఏర్పాటు చేసిన మహాగణపతి.. ఈ ఏడాదితో 70 ఏళ్లయిన సందర్భంగా.. 70 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మహాగణపతి నమూనాను శుక్రవారం ఆవిష్క రించారు. ‘శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి’గా 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో స్వామి దర్శనమివ్వనున్నారు.నిల్చున్న ఆకృతిలో ఉండే గణపతి తలకు ఇరువైపులా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు, రెండు వైపులా 14 చేతులు, కుడివైపు చేతుల్లో చక్రం, అంకుశం, పుస్తకం, త్రిశూలం, కమలం, శంఖం, ఎడమ వైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉన్నాయి.మహాగణపతి పక్కన కుడివైపు పది అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాల రాముడి విగ్రహం, ఎడమవైపు రాహుకేతువుల విగ్రహాలను 9 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు.వినాయకుడి పాదాల చెంత 3 అడుగుల మేర మూషిక వాహనం ఉంటుంది. మహాగణపతి కుడివైపు 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కల్యాణం, ఎడమవైపు శివపార్వతుల కల్యాణం విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. -
రెండో రోజు ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక పూజలు
-
Ganesh Chaturthi 2022: హైదరాబాద్‌లో గణేష్.. జోష్
సాక్షి, హైదరాబాద్: భక్తకోటి ఇష్టదైవం బొజ్జ గణపయ్య మరికొద్ది గంటల్లో కొలువుదీరేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాల కోసం నగరం శోభాయమానమైంది. వినాయక చవితి వేడుకలకు మండపాలు అందంగా ముస్తాబవుతున్నాయి. మహానగరం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మరోవైపు వినాయక విగ్రహాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి తదితర వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ప్రధాన రహ దారులకు ఇరువైపులా అమ్మకాలతో సందడి నెలకొంది. పర్యావరణహిత మట్టి ప్రతిమల పట్ల నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ లాంటి ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే లక్షలాది విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశాయి. ధూల్‌పేట్, ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల అమ్మ కాలు మంగళవారంఆఖరి రోజు జోరుగా సాగాయి. విగ్రహాల తరలింపు, పూలు, పండ్లు, పూజావస్తువుల కొనుగోళ్ల కోసం జనం పెద్ద ఎత్తున రహదారులపైకి చేరడంతో నగరంలోని అనేక చోట్ల మంగళవారం ఉదయం నుంచే ట్రాఫిక్ రద్దీ నెలకొంది. వైవిధ్యమూర్తులు.. వైవిధ్యభరితమైన విగ్రహమూర్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తిని ప్రతిబింబించే విగ్రహాలు, మహాభారత్ వినాయకుడు, అర్ధనారీశ్వరుడి సమక్షంలో కొలువైన బొజ్జ గణపయ్య, అంగరక్షకులు, సేవకుల సమక్షంలో మందిరంలో కొలువైన దేవదేవుడు, షిరిడీ సాయిబాబా ఆకృతిలో, ముంబై గణేశుడిగా.. ఇలా అనేక రకాల రూపాల్లో కొలువైన వినాయకుడు నవరాత్రి ఉత్సవాలకు సిద్ధంగా ఉన్నాడు. బహు ముఖ వినాయకుడు మరో ప్రత్యేక ఆకర్షణ. భక్తుల మదిని దోచే వివిధ రకాల భంగిమలు, ఆకృతు లతో, చక్కటి రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దిన విగ్రహాలు ఇప్పటికే మండపాలకు చేరుకు న్నాయి. గ్రేటర్ పరిధిలో సుమారు 50 వేలకు పైగా మండపాల్లో నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. సందడిగా మార్కెట్లు.. ధరలకు రెక్కలు వినాయక చవితి సందర్భంగా పూజ కోసం వినియోగించే 21 రకాల పత్రి, బంతిపూలు,మామిడి ఆకులు, మారేడు కాయల అమ్మకాలతో మార్కెట్లలో సందడి నెలకొంది. పండుగ సందర్భంగా పూల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్లలో బంతిపూలు కిలో రూ.70 వరకు ఉంటే పూల దుకాణాల వద్ద కిలో రూ.150 వరకు విక్రయించారు. బుధవారం ఒక్క రోజే సుమారు 21 టన్నులకు పైగా బంతి పూల విక్రయాలు జరిగినట్లు మార్కెట్ వర్గాల అంచనా. చామంతి పూలు హోల్‌సేల్‌గా కిలో రూ. 170 వరకు ఉంటే రిటైల్‌గా రూ.250 వరకు అమ్మారు. అలాగే గులాబీ, కనకాంబరాల ధరలు సైతం భారీగా పెరిగాయి. సెంట్ గులాబీలు హోల్‌సేల్ మార్కెట్లో రూ.200 కిలో చొప్పున, కనకాంబరాలు రూ.1000కి కిలో చొప్పున విక్రయించారు. పూల మార్కెట్ కిటకిట గోల్కొండ: వినాయక చవితిని పురస్కరించుకుని పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గుడిమల్కాపూర్‌లోని పి.ఇంద్రారెడ్డి పూల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. తడి, పొడి పూలు అంటూ విడివిడిగా బంతి, చామంతులను విక్రయించారు. ఒక్కరోజే మార్కెట్‌కు వంద వాహనాల్లో రికార్డుస్థాయిలో బంతిపూలు వచ్చాయని వర్తకుల సంఘం ప్రతినిధి దేవర శ్రీనివాస్ తెలిపారు. -
గణేశ్ నిమజ్జనం: ఈ ఫొటో చూసి వావ్ అనాల్సిందే!
అకేషన్ ఏదైనా ఫొటో ఉండాల్సిందే. ఫోన్ చేతిలో ఉంటే ‘బొమ్మ’పడాల్సిందే. స్మార్ట్ఫోన్లు విరివిరిగా అందుబాటులోకి వచ్చాక ఫొటోలు తీయడం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది. కళ్ల ముందు కనిపించే ప్రతి దృశ్యాన్ని ఫోన్ కెమెరాలో బంధించేందుకు ఆరాటపడుతున్నారు జనం. ఇలాంటి దృశ్యమే హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా ఆవిష్కృతమైంది. భక్తుల ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్రగా నిమజ్జనానికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని భాగ్యనగర వాసులు పులకితులయ్యారు. అంతేకాదు శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిని తమ ఫోన్ కెమెరాలతో ఫొటోలు తీసుకుని మురిసిపోయారు. ఆ సందర్భంగా తీసిన ఈ ఫోటోను హాయ్ హైదరాబాద్ ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. Photo Courtesy: Hi Hyderabad Twitter Page గణేశ్ నిమజ్జన వేడుకల్లో భాగంగా చార్మినార్ సమీపంలో తీసిన మరో ఫొటో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. శివుడి బాహువుపై ఆశీసుడైన గణనాథుడి ప్రతిమ వెనుక భాగంలో చార్మినార్ కనిపించే విధంగా తీసిన ఈ ఫోటో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. Photo Courtesy: Hi Hyderabad Twitter Page -
ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర
-
ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తులు క్యూ
-
ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్త సందోహం
-
భారీ గణనాథుడిని గవర్నర్ నరసింహన్ దంపతులు
-
తొలిపూజ నేనే చేస్తున్నా: నరసింహన్
సాక్షి, హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ భారీ గణనాథుడిని గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఈ ఏడాది ద్వాదశాదిత్య రూపుడిగా దర్శనమిచ్చిన మహాగణపతికి తొలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ...తాను గవర్నర్ అయినప్పటి నుంచి ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకొని తొలి పూజ చేస్తున్నానని తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించేవారికి సకల శుభాలు కలుగుతాయన్నారు. వినాయకుడి ఆశీస్సులతో బంగారు తెలంగాణ... రత్నాల తెలంగాణ అవుతుందని ఆకాంక్షించారు. మరోవైపు ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడిని దర్శించుకునేందుకు పలువురు వీఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా భారీ సంఖ్యలో గణనాథుడి చెంతకు చేరుకుంటున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ బండారు దత్తాత్రేయ, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయా రెడ్డి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ సతీమణి అనితా నాగేందర్ స్వామి వారికి వెండితో తయారు చేసిన 75 అడుగుల జంధ్యాన్ని సమర్పించారు. అదే విధంగా లంగర్‌హౌస్‌కు చెందిన భక్తులు 750 కిలోల లడ్డూను మహాగణపతికి నివేదించారు. పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గ ఆధ్వర్యంలో 75 అడుగుల జంధ్యం, కండువా, గరిక మాలను స్వామి వారికి అలంకరించారు. -
శ్రీ ద్వాదశాదిత్య రూపుడిగా ఖైరతాబాద్ మహాగణపతి
-
గంగను చేరె.. ‘ఘన’పతి
రెండో రోజూ కొనసాగిన నిమజ్జనం 9 గంటలకు పైగా ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర రేపు మహా లడ్డూ పంపిణీ అణువణువూ గణేషుడి నామ స్మరణే. అడుగడుగునా వినాయకుని రూపమే. దారి పొడవునా వేలాది జనాల నీరాజనాలు అందుకుంటూ... అంతే స్థాయిలో తరలివచ్చిన విగ్రహాల తోడుగా... సోమవారం రాత్రి 10.10గంటలకు ఖైరతాబాద్ త్రిశక్తిమయ మోక్ష గణపతి గంగమ్మ ఒడిలో విశ్రమించాడు. సిటీబ్యూరో/ఖైరతాబాద్ /బన్సీలాల్‌పేట్: అదే ఉత్సాహం. అదే ఉరవడి. వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో.. వినాయక విగ్రహాలతో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పరిసరాలు పోటెత్తాయి. ‘జై బోలో గణేశ్ మహారాజ్‌కీ...’ అంటూ సాగిన నిమజ్జన మహాయాత్ర రెండో రోజు సోమవారం రాత్రి వరకు కొనసాగింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చాయి. మరోవైపు ఖైరతాబాద్ త్రిశక్తిమయ గణపతి శోభాయాత్ర మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల సమయంలో ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంది. ఆదివారమే తరలించాలని భావించినప్పటికీ భక్తుల రద్దీ, పోలీసుల అనుమతి లభించకపోవడంతో ఈ శోభాయాత్ర సోమవారానికి వాయిదా పడింది. మహా గణపతి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆధ్మాతిక గీతాలు, నినాదాలతో శోభాయాత్ర సాగింది. రికార్డు స్థాయిలో... సాగర్‌లో ఆదివారం నుంచి సోమవారం వరకు ఏకధాటిగా 32 గంటల పాటు నిమజ్జనోత్సవం సాగింది. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించిన నాటి నుంచి చివరి రోజు వరకూ రికార్డు స్థాయిలో 13,600 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఆదివారం ఉదయం 10 నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు హుస్సేన్ సాగర్‌లో 5,720 పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇవి కాకుండా చిన్న చిన్నవి, కుటుంబాలతో తరలి వచ్చిన భక్తులు నిమజ్జనం చేసిన విగ్రహాలన్నీ కలిపి 25 వేలు దాటి ఉండవచ్చునని పోలీసుల అంచనా. ట్రాఫిక్‌తో జనం ఇక్కట్లు గణేష్ నిమజ్జనం సోమవారం కూడా కొనసాగడంతో వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం కొనసాగడంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ట్రాఫిక్ రద్దీతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ట్యాం క్బండ్ పరిసర ప్రాంతాలైన కవాడిగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, ఇందిరాపార్కు, ముషీరాబాద్, కర్బలామైదాన్ తదితర ప్రాంతాల్లో వాహన చోదకులు... పాదచారులు... ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. చెత్త తరలింపు ముమ్మరం 1345 మెట్రిక్‌టన్నుల వ్యర్థాల తరలింపు సిటీబ్యూరో: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక బృందాలతో చెత్త తరలింపు పనులు చేపట్టిన జీహెచ్ఎంసీ..సోమవారం సాయంత్రం వరకు 1345 మెట్రిక్‌టన్నుల చెత్తను నగర రహదారుల మీదినుంచి డంపింగ్‌యార్డుకు తరలించింది. సోమవారం రాత్రి వరకు నిమజ్జనం జరుగుతున్నందున మంగళవారం ఉదయానికే చెత్త లేకుండా రహదారులను శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. మంగళవారం జరుగనున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.