Salman Khan Bumper Offer To Shehnaaz Gill For Kabhi Eid Kabhi Diwali Movie - Sakshi
Sakshi News home page

Salman Khan: బిగ్‌బాస్‌ బ్యూటీకి సల్మాన్‌ ఖాన్‌ బంపరాఫర్‌, ఆమె ఎంత అడిగితే అంత!

Published Sat, Apr 30 2022 11:18 AM | Last Updated on Sat, Apr 30 2022 12:11 PM

Salman Khan Bumper Offer To Shehnaaz Gill For Kabhi Eid Kabhi Diwali - Sakshi

సల్మాన్‌ ఖాన్‌, వెంకటేశ్‌, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కబీ ఈద్‌ కబీ దీవాలి'. ఈ సినిమాలో జగపతిబాబు విలన్‌గా కనిపించే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో బిగ్‌బాస్‌ బ్యూటీ షెహనాజ్‌ గిల్‌ కూడా నటించనున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సల్మాన్‌ అడగడంతో వెంటనే ఆమె ఓకే చెప్పిందని సమాచారం.

సల్మాన్‌కు షెహనాజ్‌ అంటే వల్లమాలిన అభిమానం. హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌లో తొలిసారి షెహనాజ్‌ను చూసిన సల్మాన్‌ ఆమె అమాయకత్వాన్ని చూసి ముచ్చటపడ్డాడట. అప్పటినుంచి ఆమెను అభిమానిస్తున్న సల్లూభాయ్‌ ఈసారి ఏకంగా ఆమెకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. 'కబీ ఈద్‌ కబీ దీవాలి' సినిమాలో ఆమెను ఎంపిక చేసుకోవడమే కాక తనకు నచ్చినంత పారితోషికాన్ని ఇవ్వాలన్నాడట.

చదవండి: బిగ్‌బాస్‌ బ్యూటీ శ్వేత వర్మకు చేదు అనుభవం, సినిమా ఛాన్స్‌ ఇచ్చినట్టే ఇచ్చి..

సాధారణంగా రెమ్యునరేషన్‌ అనేది నిర్మాతల చేతిలో ఉంటుంది. కానీ సల్లూ మాత్రం షెహనాజ్‌ తనకు కావాల్సినంత డబ్బు డిమాండ్‌ చేయవచ్చని చెప్పాడట. అంతేకాదు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె ఏ డేట్స్‌ కోరితే అప్పుడే షూటింగ్‌ పెట్టుకుందామని అన్నాడంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. ఇకపోతే ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఈ ఏడాది డిసెంబరు 30నే సినిమాను రిలీజ్‌ చేస్తామని ఇటీవల చిత్రయూనిట్‌ ప్రకటించింది.

చదవండి: వెంకటేశ్‌-సల్మాన్ ఖాన్ సినిమా షురూ.. విలన్​గా ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement