సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ
గ్యాంగ్‌స్టర్స్‌ను అంతం చేయడానికి రెడీ అయ్యారు సల్మాన్ ఖాన్. ఈ ప్రయాణంలో తన బామ్మర్దితో తలపడనున్నారు. సల్మాన్ ఖాన్, ఆయన బావమరిది ఆయుష్ శర్మ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్’. సల్మాన్ ఖాన్ స్వీయ నిర్మాణంలో మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్, ఆయుష్ ఇద్దరూ సీరియస్‌గా తలపడుతున్న వీడియోను సోమవారం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో పంజాబీ పోలీసాధికారిగా సల్మాన్, గ్యాంగ్‌స్టర్‌గా ఆయుష్ కనిపిస్తారు.
నయా షాజహాన్
ప్రేమ అనగానే తాజ్ మహాల్ గుర్తొస్తుంది. షాజహాన్ గుర్తొస్తాడు. ‘నేను నయా షాజహాన్’ అంటున్నారు అక్షయ్ కుమార్. హిందీ చిత్రం ‘అత్రంగీ’ కోసమే ఈ ప్రేమ వేషాలు వేస్తున్నారు అక్షయ్. సారా అలీఖాన్, ధనుశ్ జంటగా అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘అత్రంగీ’. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు. సారా అలీఖాన్‌ను ప్రేమలో పడేయాలని ప్రయత్నించే పాత్రలో అక్షయ్ కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం తాజ్ మహాల్ దగ్గర జరుగుతోంది. అక్షయ్, సారా, ధనుశ్ ముగ్గురిపై ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఇంతకి ఈ నయా షాజహాన్ ప్రేమ కోసం ఏం కట్టాడో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment