
ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం రణం రుధిరం)... ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే పేరు వినిపిస్తోంది. అంతలా మార్మోగిపోతోందీ సినిమా. ఒక్క హిందీలోనే వంద కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రంపై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్ సైతం ఆర్‌ఆర్‌ఆర్‌కు ఫిదా అయ్యామంటూ జక్కన్నను, తారక్, చెర్రీలను మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: పన్నెండేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ ఫోకస్ కాలేదు
'ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నాను. చిరంజీవితో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభూతినిస్తోంది. చిరంజీవిగారితో నాకు చాలాకాలం నుంచే పరిచయం ఉంది. ఆయన నాకు మంచి ఫ్రెండ్. అతడి తనయుడు రామ్‌చరణ్ కూడా నాకు స్నేహితుడే. ఆర్‌ఆర్‌ఆర్‌లో చరణ్ అద్భుతంగా నటించాడు. సినిమా విజయం సాధించినందుకు అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అతడిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. కెరీర్‌లో బాగా రాణిస్తున్నందుకు సంతోషంగానూ ఉంది. అదేంటో దక్షిణాది సినిమాలు హిందీలో బాగా ఆడతాయి, కానీ మా చిత్రాలు మాత్రం సౌత్‌లో పెద్దగా ఆడవు. అది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజంగానే ఇక్కడి సినిమాలు హిందీలో బాగా సక్సెస్ అవుతాయి' అని చెప్పుకొచ్చాడు సల్లూభాయ్.
చదవండి: పునీత్ లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా, దేవుడిపై కోపం తెప్పిస్తుంది
Comments
Please login to add a commentAdd a comment